Advertisement
Google Ads BL

బన్నీ ఏమోగానీ.. మహేష్ మాత్రం పక్కా..!


ఈ ఏడాది మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా, బన్నీ ‘అల వైకుంఠపురములో’ సినిమాలు సంక్రాంతి పోరులో పోటీ పడడం.. ముందు నుంచి రెండు సినిమాలపై ఆసక్తికర పోటీ ఉండడంతో.. విడుదలయ్యాక కూడా ఆ రెండు సినిమాలు జనాల్లో పిచ్చ క్రేజ్ రావడం.. ఆ క్రేజ్ తో ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ అయితే, మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అయితే తాజాగా మహేష్ - బన్నీ బాక్సాఫీస్ పోరు మరోసారి అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు - అల్లు అర్జున్ ఒకేసారి సినిమాలు మొదలెట్టేలా ఉంది ప్రస్తుతం పరిస్థితి. మహేష్ ‘సర్కారు వారి పాట’.. బన్నీ ‘పుష్ప’ రెండూ ఒకేసారి పట్టాలెక్కబోతున్నాయి.  పరశురామ్ - మహేష్ పక్కా ప్లానింగ్‌తో పట్టాలెక్కుతుంటే.. సుకుమార్ - అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవల్‌కి సినిమాని రెడీ చేసుకుని కూర్చున్నారు.

Advertisement
CJ Advs

ఒకరి మీద ఒకరు పోటీతో సినిమాలను ఫినిష్ చేసి వచ్చే ఏడాది వేసవికి ఒకే నెలలో కొద్దిగా అటు ఇటుగా పోటీ పడే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినబడుతుంది. అయితే సుకుమార్‌తో సినిమా అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే బన్నీ ది పాన్ ఇండియా మూవీ. అందులోను సుక్కు చెక్కిందే చెక్కి చెక్కిందే చెక్కుతాడు. పరశురామ్ మహేష్ మూవీ జస్ట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మూవీ కావడం.. పరశురామ్ అనుకున్న టైం కి సినిమాని లైన్‌లో తేవడం పక్కా. అందుకే బన్నీ నెక్స్ట్ మూవీ వేసవికి వస్తుందో.. రాదో కానీ.. మహేష్ మాత్రం పక్కాగా అభిమానులకు టచ్లో ఉంటాడంటున్నారు.

Again Fight between Mahesh Babu and Allu Arjun:

Mahesh Babu and Allu Arjun Movies Release updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs