Advertisement
Google Ads BL

ఐదేళ్లకే మ్యాగజైన్ పై మెరిసిన హీరోయిన్...


టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. పూజా హెగ్డేతో పోటీ పడుతూ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తుంది. ఛలో సినిమాతో తెలుగు తెరకి పరిచయమై గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరుమ్ భీష్మ వంటి హిట్లతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తుంది.

Advertisement
CJ Advs

వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్న ఈ భామ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఈ మధ్య అభిమానులతో ముచ్చటిస్తూ తనని ఎలాంటి సినిమాల్లో చూడాలని కోరుకుంటున్నారో చెప్పండని సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆమె పంచుకున్న ఫొటో ఒకటి వైరల్ గా మారింది. రష్మిక ఐదేళ్ళున్నప్పుడు ఒక మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన ఫోటోని షేర్ చేసింది.

గోకులం అనే మ్యాగజైన్ కోసం 2001లో దిగిన ఫోటో అని చెబుతూ, ఈ ఫోటోని మా అమ్మ దాచుకుందని, అదొక్కటే కాదు ఇప్పటికీ మ్యాగజైన్ కవర్ పేజీలపై వచ్చే ప్రతీ ఫోటోని దాచుకుంటుందంటూ చెప్పింది.

Rashmika Mandannas five years photo on Magazine cover:

Rashmika Mandannas five years photo on Magazine cover
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs