ఆంధ్రప్రదేశ్‌లో ఏ షూటింగ్ జరపాలన్నా.. ఇక ఎమ్మెల్యే రోజా అనుమతి కావాల్సిందేనా..? చిన్న హీరో మొదలుకుని స్టార్ హీరోల సినిమాల వరకూ రోజాను సంప్రదించాల్సిందేనా..? ఈ అనుమతి బాధ్యతలన్నీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అప్పగించేశారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే నిజమని అనిపిస్తోంది. ఇదేంటి దీనికంటూ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు కదా..? మరీ రోజాకు ఆ బాధ్యతేంటి..? రోజాకు అప్పగించడం వెనుక అసలేంటి వ్యవహారం..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రస్తుతం.. అటు ఇండస్ట్రీకి.. ఇటు పార్టీకి దగ్గరగా ఉన్న వ్యక్తులు ఇద్దరే. ఒకరు విజయ్ చందర్ కాగా.. ఇంకొకరు రోజా మాత్రమే. ఇప్పుడు ఇండస్ట్రీని ఏపీకి రప్పించడానికి ఎలాంటి పాలసీలు తీసుకురావాలి..? స్టూడియోలు కడితే ఎలాంటి రాయితీలు ఇవ్వాలి..? ఇంకా చాలా చాలా విషయాలను విజయ్ చందర్‌కు జగన్ అప్పగించారని తెలుస్తోంది. ఇందుకు గాను సలహాల కోసం ఓ ఐఏఎస్‌ను కూడా ప్రత్యేకంగా నియమించారట. మరోవైపు ఆయన ఆ పనిలో బిజీగా ఉంటే.. ఈ లోపు ఏపీలో షూటింగ్స్, సినిమా రిలీజ్‌ల వ్యవహారం ఇవన్నీ చూసుకోవాలని రోజాకు సీఎం బాధ్యతలు అప్పగించారని టాక్ నడుస్తోంది. సో.. ఇదే నిజమైతే.. ఇకపై ఏపీలో ఏ సినిమా షూటింగ్స్ చేసుకోవాలన్నా రోజా నుంచి అనుమతి రావాల్సిందే అన్న మాట. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.