Advertisement
Google Ads BL

కరోనాపై ఏపీ రిలీజ్ చేసిన పాటలో హీరో నిఖిల్


కరోనాపై పాటను రిలీజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 

Advertisement
CJ Advs

కరోనా ప్రభావం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ విపత్కర వ్యాధి ప్రబలకుండా యావత్ దేశాలు శక్తి మేర కృషి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం కొనసాగుతుంది. ఐతే కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల చాలా మంది వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పట్లో కరోనాకి వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి కరోనా బారిన పడకుండా మనమందరం జాగ్రత్త ఉంటూ, లాక్‌డౌన్ సమయంలో ఎలా అయితే మనం పోలీసులుకు, వైద్య సిబ్బందికి సహకరించామో అదే రీతిన ఇకపై  కొనసాగాలని, కరోనా వల్ల, దెబ్బ తిన్న మన జీవితాలని మళ్ళీ మనమే నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని అర్థం వచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి యంగ్ హీరో నిఖిల్ తో కలిసి ఓ పాటని సిద్ధం చేయించారు.

ఈ పాటకు ప్రముఖ దర్శకుడు చందు మొండేటి కాన్సెప్ట్‌ని రెడీ చేశారు. అలానే ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. అలానే ఈ పాటలో వివిధ రంగాలకు చేసిన ప్రముఖులు కనిపించారు. వారిలో కాజల్ అగర్వాల్, నిధి అగర్వాల్, ప్రణీత సుభాష్, సుధీర్ బాబు, పి వి సింధు తదితరులు ఉన్నారు. మనం అంతా కలిసి కరోనాని అడ్డుకోవాలి అని చాటి చెప్పే రీతిన ఈ పాటను తాజాగా విజయ సాయిరెడ్డి విడుదల చేశారు.

Click Here For Song

Covid 19 song by AP Government:

Hero Nikhil in AP Released Song on Corona
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs