Advertisement
Google Ads BL

విరాట పర్వంలో కామ్రేడ్ భారతక్క...


నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మారిన వేణు ఊడుగుల రానా దగ్గుబాటి హీరోగా విరాట పర్వం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా, తెలంగాణలోని నక్సలైట్ల కథాంశంతో రూపొందిస్తున్నారు. మొన్నటికి మొన్న సాయిపల్లవి లుక్ ని రివీల్ చేసిన చిత్ర బృందం తాజాగా మరో అప్డేట్ తో బయటకి వచ్చింది. ఈ చిత్రంలో జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న హీరోయిన్ ప్రియమణి నటిస్తుందన్న విషయం తెలిసిందే. 

Advertisement
CJ Advs

నేడు ఆమె పుట్టినరోజుని పురస్కరించుకుని పియమణి లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. కామ్రేడ్ భారతక్కగా ప్రియమణి లుక్ చాలా ప్రెష్ గా ఉంది. మహా సంక్షోభం కూడా శాంతికి దారి తీస్తుందన్న నమ్మకంతో ఉండే క్యారెక్టరేజేషన్ లో ప్రియమణి పాత్ర, ఫ్రెంచ్ విప్లవంలో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకంగా ఉంటుందో సినిమాకి అంత కీలకంగా ఉండనుందట. సురేష్ ప్రొడక్షన్, శ్రీ  లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Priyamani look from VirataPravam..:

Priyamani as Comrade Bharatakka in Virata Parvam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs