Advertisement
Google Ads BL

మహేష్ ఫ్యాన్స్ అప్పుడే మొదలెట్టేసారు..


సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ సినిమా గురించి ఎంతగానో ఎదురుచూసిన అభిమానులు సర్కారు వారి పాట ప్రకటన రాగానే ఎంతో ఉత్సాహానికి లోనయ్యారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ ముఖం కనబడకుండా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఎన్నో ప్రశ్నలని రేపింది. మహేష్ అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నట్టుగా కొత్తగా కనిపించబోతున్నాడని అర్థమైపోయింది.

Advertisement
CJ Advs

మెడ మీద రూపాయి టాటూతో స్టైలిష్ గా కనిపించిన మహేష్ లుక్ కి అభిమానులు ఫిదా అయ్యారు. అయితే ఈ ఫస్ట్ లుక్ లో మహేష్ ఫేస్ కనిపించకపోయేసరికి కొంత నిరాశ పడ్డారేమో, వెంటనే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ని రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం ఒకానొక పోస్టర్ ని రెడీచేసి వదిలారు. ఫస్ట్ లుక్ లో కనిపించిన హెయిర్ స్టైల్, చెవిపోగు, మెడ మీద రూపాయి టాటూతో మహేష్ ముఖం కనిపించేలా  పోస్టర్ ని రెడీ చేసారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానులని అమితంగా ఆకర్షిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ బ్యానర్ జీ ఎమ్ బీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందించనున్నాడు. హీరోయిన్ ఎవరనేది ఇంకా స్పష్టం కాలేదు. కియారా అద్వానీని తీసుకోవాలని అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

Mahesh fans made a poster of Sarkaru vaari paata:

Mahes made fan made posters
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs