Advertisement
Google Ads BL

నాకు ఆర్ధిక ఇబ్బందులా.. అంటున్న రాశి!


చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చి బాలనటిగా ఫేమ్ తెచ్చుకుని, తర్వాత హీరోయిన్‌గా మారి చాలా తక్కువ సమయంలోనే ఫేడవుట్ అయిన నటి రాశి. బరువు పెరగడంతో ఆమెకి ఆఫర్స్ బాగా తగ్గాయి. ఇక హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాక వ్యాంప్ కేరెక్టర్స్ కూడా చేసిన రాశి తర్వాత పెళ్లి చేసుకుని కూతుర్ని కన్నాక సినిమాలకు దూరమైంది. అయితే మళ్లీ రెండేళ్ల క్రితం రాశి సినిమాల్లోకి అమ్మ పాత్రలతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం చిన్న చిన్న కేరెక్టర్స్ చేస్తున్న రాశికి ఆర్ధిక ఇబ్బందులు అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియా కెక్కింది.

Advertisement
CJ Advs

సినిమాల్లో అవకాశాలు రాక రాశి ఇబ్బందులు పడుతుంది అని, పెళ్లి తర్వాత రాశి మళ్లీ సినిమాల్లోకి వచ్చింది కూడా ఆర్ధిక ఇబ్బందుల వల్లనే అంటూ ఆ న్యూస్ సారాంశం. అయితే తాజాగా రాశి మాట్లాడుతూ.. నాపై వస్తున్న ఈ వార్తల్లో నిజం లేదని చెప్పడమే కాదు... తనకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని స్పష్టం చేసింది. భర్త, కూతురు, కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నానని చెప్పిన రాశి సమస్యలు ఎవరికైనా వస్తుంటాయని... వాటిని దాటుకుంటూ ముందుకు సాగాలని అంటుంది. అయితే ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిన రాశి ఇబ్బందులు ఎవరికైనా వస్తాయి.. దానిని దాటుకుంటూ వెళ్లాలని చెప్పడంలో ఆంతర్యమేమిటో రాశినే చెప్పాలి.

Raasi Reacted on Financial Problems :

No Financial Problems to me says Actress Raasi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs