సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున మహేష్ బాబు - పరశురామ్ మూవీ ఆఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ‘సర్కారు వారి పాట’ అంటూ పోస్టర్‌తో సహా మహేష్ బాబు బ్యాక్ లుక్ బయటికి వచ్చేసింది. అయితే లాక్ డౌన్ ముగిసిపోతే ఈపాటికి మహేష్ సినిమా సెట్స్ మీదకెళ్ళేది. ఇప్పటికే పరశురామ్ పూర్తి స్క్రిప్ట్ పట్టుకుని నటీనటుల ఎంపిక చేపట్టాడట. అల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన కీలకపాత్రలు ఎంపిక జరిగిందని.. అయితే హీరోయిన్ ఫైనల్ కాకపోవడంతోనే తాజా ప్రకటనలో ఆమె పేరు బయటికి రాలేదట. అయితే కియారా అద్వానీ పేరు గట్టిగా వినిపిస్తుండగా.. కియారా డేట్స్ ప్రాబ్లెమ్‌తో మరో హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో పరశురామ్ టీం ఉందట.
అయితే తాజాగా విడుదలైన మహేష్ న్యూ లుక్ కి సంబందించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ లో మహేష్ చెవికి రింగ్, కాస్త పక్కన రూపాయి టాటూ, బాగా రఫ్ గా ఉన్న గెడ్డం, రఫ్ గా ఉన్న హెయిర్ స్టయిల్ అన్ని మహేష్ మాస్ లుక్ ని తలపిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే మహేష్ మేకోవర్ అవుతున్నాడు. అయితే ముందుగా మహేష్ లుక్‌లో మెడ మీద రూపాయి టాటూ ఉండేది కాదట. అసలైతే ఈ కథని పరశురామ్ అమెరికా నేపథ్యంలో రాసుకున్నాడట. అందుకే రూపాయి నాణెం బదులు మెడపై డాలర్ నోటు టాటూ ఉండాల్సింది. కానీ కరోనా కల్లోలంతో ప్రస్తుతం అమెరికా షూటింగ్ అంటే కుదరదని.. అందుకే హైదరాబాద్ నేపథ్యం ఉన్న కథగా మళ్లీ మార్చుకుని మహేష్ లుక్ లో చిన్న చేంజ్ చేసి ఆ రూపాయి టాటూని మెడపై వేశారని అంటున్నారు. అంటే కరోనాతో మహేష్ టాటూ అలా మారిందన్నమాట.