Advertisement
Google Ads BL

ఆ బయోపిక్ ని లిఫ్ట్ చేసేదెవరు..?


సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ చాలా రోజుల నుండి నడుస్తుంది . సినిమా, రాజకీయ, క్రీడా రంగాల్లో అశేష ప్రతిభ కనబర్చిన వారి జీవిత చరిత్రలని వెండితెర మీదకి తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఆ నేపథ్యంలోనే తాజగా చాలా బయోపిక్స్ సెట్స్ పైకి వెళ్లాయి. ఇండియన్ క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ జీవిత కథని శభాష్ మిథు అనే టైటిల్ తో బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇంకా సైనా నెహ్వాల్, పీవీ సింధు, పుల్లెల గోపీచంద్ జీవితాలపై సినిమా ఉంటుందని వార్తలొచ్చినా అవి ఎక్కడి వరకు వచ్చాయనేది తెలియదు. అయితే తాజాగా మరో బయోపిక్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇండియా నుండి ఒలింపిక్స్ లో మొట్టమొదటి బంగారు పతకం సాధించిన మహిళగా గుర్తింపు తెచ్చుకున్న కరణం మల్లీశ్వరి జీవితం వెండితెర మీదకి రాబోతుంది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో దేశాన్ని ఆకాశానికెత్తేసిన ఈమె జీవితంలోని ఆసక్తికర సంఘటనల్ని సినిమా ద్వారా చూడబోతున్నాం.

శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన మల్లీశ్వరి జీవితం ఒలింపిక్స్ వరకి ఎలా సాగిందన్నది చూపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో కరణం మల్లీశ్వరి పాత్రలో ఎవరు నటించబోతున్నారనేది మాత్రం చెప్పలేదు. నిత్యామీనన్ ని సంప్రదించారని వార్తలు వచ్చినా.. ఆమె ఒప్పుకోలేదని టాక్. ఇంకా తాప్సీ పన్ను, రకుల్ ప్రీత్ లని అడుగుతున్నారని అంటున్నారు. ప్రీ లుక్ తో ఆసక్తి రేపిన చిత్రబృందం హీరోయిన్ ని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

Who will lift the biopic..?:

who will lift this biopic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs