బాలకృష్ణ తాజాగా టాలీవుడ్ పెద్దలంటూ చెప్పుకుంటున్న తేనే తుట్టుని కెలికి వదిలాడు. బాలయ్య అలా అన్నాడో లేదో ఇలా బాలయ్య మీదికి టాలీవుడ్ లో చాలామంది యుద్ధం ప్రకటించడం, బాలయ్యకి కూడా కొందరు సపోర్ట్ చెయ్యడంతో ఇప్పుడు టాలీవుడ్ మొత్తం హాట్ హాట్ గా మారింది. అయితే సినిమా పెద్దలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని.. బాలయ్యని పిలవకుండా కలవడంతోనే బాలయ్యకి మండింది అందుకే ఇలా మాట్లాడాడు అనుకున్నారు. కానీ బాలయ్యకి మండింది ఇప్పుడు కాదు అప్పుడెప్పుడో.. అంటే మా ఫండ్ రైజింగ్ కోసం చిరు బ్యాచ్ అమెరికా వెళ్ళినప్పుడే అంట.
ఆ విషయం బాలయ్యే స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఇండస్ట్రీలో హిపోక్రసీ, సైకో ఫాన్సీ ఎక్కువ. ఆ ఫాన్సీ ప్రత్యేకంగా నాకు ఎక్కువ ఉంది. మిగతావాళ్ల సంగతి పక్కనపెట్టండి.. నేను లెక్కచేయను. నాకున్నంత ఎవరికీ లేదు సైకో ఫాన్సీ. కాళ్ల మీద పడటాలు, దణ్ణాలు పెట్టడాలు లాంటివి నాకు ఎక్కువ. నేను దేనిలో ఇన్వాల్వ్ కాను. మొన్న జరిగిన విషయంలో నేను ఇన్వాల్వ్ కాను అన్నారు. అవును నేను ఇన్వాల్వ్ అవును. నా పని నేను చేసుకుంటాను. అనవసర విషయాల్లో ఎందుకు దూరి నా టైం వేస్ట్ చేసుకోవాలి. అంతెందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం బిల్డింగ్ కడుతున్నారు. దానికి ఫండ్ రైజింగ్ కోసం అమెరికా వెళ్లారు. నన్ను పిలిచారా? పిలవలేదు. చిరంజీవి గారు అందరూ కలిసి హడావిడి చేసి.. 5 కోట్లన్నారు. వాటన్నిటిలో నేను ఇన్వాల్వ్ కాను. ఇక ఇక్కడి ప్రభుత్వం ఇండస్ట్రీకి సపోర్ట్ గా ఉందిగా అంటున్నారు. మరి సపోర్ట్ చేస్తే ఓ రెండు మూడెకరాలు ఇండస్ట్రీ కోసం ప్రభుత్వం ఇవ్వలేదా?
ఒక బిల్డింగ్ ఇప్పటివరకు కట్టలేకపోయారు. కరోనా ఉధృతి కొనసాగుతుంటే.. షూటింగ్స్ కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు. ఇక అమెరికా ఫండ్ రైజింగ్ లో 5 కోట్లన్నారు. కానీ మళ్లీ కోటి అన్నారు. అంటే మిగతా నాలుగు కోట్లు ఏమయ్యాయి. మేమేమన్న లెక్కలడిగామా? మేము లెక్కల మాస్టర్స్ కాదు. అందుకే నేను అస్సలు పట్టించుకోను అంటూ బాలయ్య కాస్త కాంట్రవర్సీలకు తెర లేపినట్టే మాట్లాడాడు.