Advertisement
Google Ads BL

ప్రభాస్ సినిమా టైటిల్ సెర్చింగ్ స్టార్ట్!


ప్రభాస్ సాహో సినిమా తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్లో సినిమా చేస్తున్నాడు. అయితే సాహో దెబ్బకి రాధాకృష్ణ సినిమా కథని అటు తిప్పి ఇటు తిప్పి మార్పులు చేర్పులు చేసి చివరికి ఎలాగో రెగ్యులర్ షూట్ కి వెళితే కరోనా అడ్డు పడింది. అయితే రాధాకృష్ణ - ప్రభాస్ సినిమా ఎప్పుడో మొదలైనా ఇప్పటికి ఆ సినిమా అప్ డేట్ కానీ, టైటిల్ కానీ వదల్లేదు. దానితో ప్రభాస్ ఫాన్స్ పిచ్చెక్కిపోయి ఉన్నారు. జాన్, రాధే శ్యాం, ఓ డియర్ అంటూ ప్రచారం జరిగినా.. జాన్ ని వదిలేసి రాధే శ్యాం లేదంటే ఓ డియర్ ఫైనల్ చేస్తున్నారని అనడమే కానీ.. ఎక్కడ క్లారిటీ ఇవ్వకుండా మూవీ టీం ఇంకా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంది.

Advertisement
CJ Advs

అయితే ఈ నెలలోనే ప్రభాస్ మూవీ ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ రివీల్ ఉండబోతుంది అంటూ ప్రచారం షురూ అయ్యింది. అయితే టైటిల్ గా జాన్ కానీ, రాధే శ్యాం కానీ ఉండబోవని, జాన్ అయితే సమంత జానూ ముందు తేలిపోతుంది అని, అలాగే రాధే శ్యాం కి క్రేజ్ రావడం లేదని మూవీ టీం దాన్ని కూడా లైట్ తీసుకుంది అని అంటున్నారు. రాధే శ్యాం లీక్ వదిలినా ఆ టైటిల్ కి అనుకున్నానట క్రేజ్ రాలేదని అందుకే మరో టైటిల్ ని ప్రభాస్ కోసం సెట్ చేసి లీకవకుండా జాగ్రత్తలు తీసుకుని అందరికి సర్ప్రైజ్ ఇవ్వాలని మూవీ టీం చూస్తుందట. అయితే ‘ఓ డియర్’ కన్ఫర్మ్ అవ్వవచ్చు అంటూ కూడా కొన్ని వార్తలు వినబడుతున్నాయి.

Searching started for Prabhas New film Title :

Young Rebel Star Prabhas New Film Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs