Advertisement
Google Ads BL

టాలీవుడ్‌లోనే ‘సర్కారు వారి పాట’ రికార్డ్..


సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన క్షణం ఘట్టమనేని క్రిష్ణగారి పుట్టినరోజున ఫలించిన విషయం విదితమే. పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్‌తో చిత్ర ఫస్ట్ లుక్‌ని రివీల్ చేసి సందేహాలకి తెరదించారు. చెవికి రింగు, మెడ మీద రూపాయి నాణెం టాటూ, స్టైలిష్ హెయిర్ స్టైల్ చూస్తుంటే మహేష్ బాబుని సరికొత్తగా చూడబోతున్నామని తెలుస్తోంది. మహేశ్‌తో పరుశురామ్ ఎలాంటి సినిమా చేస్తాడబ్బా..? అసలు ఈ కాంబో ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో అభిమానులు కొందరు ఆలోచనలా పడినప్పటికీ ఫస్ట్ లుక్, లోగోతోనే తన సత్తా ఏంటో చూపించేశాడు.

Advertisement
CJ Advs

కేవలం 24 గంటల్లోనే..

ఇక అసలు విషయానికొస్తే.. మహేశ్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అస్సలే చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలు మొదలుకుని ప్రపంచ వ్యాప్తంగా మహేశ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా టైటిల్ లోగో రాగానే దాన్ని తెగ ట్రెండ్ చేశారు. కేవలం ఒక్కరోజులోనే అనగా 24 గంటల్లో ఈ ‘సర్కారు వారి పాట’ సంచలనం అయ్యింది. ఇప్పటికే ఈ పోస్టర్‌ను 35.3 వేల మంది రీ ట్వీట్ చేయగా.. 89.3 వేల మంది లైక్ చేశారు. ఇక కామెంట్స్ గురించి అస్సలే చెప్పనక్కర్లేదు.. లెక్కలేనన్ని వచ్చాయి. అలా టాలీవుడ్‌లో మహేశ్ మూవీ పోస్టర్ రికార్డ్ సృష్టించింది. కాగా ఇప్పటి వరకూ ఈ రేంజ్‌లో రీ-ట్వీట్లు, లైక్‌లు ఏ సినిమా పోస్టర్‌కూ రాలేదు. 

ఇటు రేంజ్.. అటు రికార్డ్..!

ఫస్ట్ టైమ్ ఈ పోస్టర్‌కే ఈ రేంజ్‌లో రీ ట్వీట్స్, లైక్స్ రావడం విశేషమని చెప్పుకోవచ్చు. అయితే ఇది కేవలం మహేశ్ ట్వీట్ చేసింది మాత్రమే.. ఇంకా ఆయన అభిమానులు, పలువురు నటీనటులు షేర్ చేసిన దాన్ని ఎంతమంది రీట్వీట్స్, లైక్‌లు చేశారో ఇక లెక్కల్లో చెప్పలేం. ఇది నిజంగా మహేశ్ అభిమానుల ఘనతే అనిచెప్పాలి. సో.. తాజా పోస్టర్‌తో పరుశురురామ్ తన రేంజ్ ఏంటో చూపించగా.. అభిమానులు మాత్రం దాన్ని రికార్డ్ సృష్టించి చేతల్లో చూపించారు. అంటే.. సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకుండానే ఇలా ఉందంటే.. అంతా అయిపోయి థియేటర్లలోకి వస్తే ‘పాట’ మామూలుగా ఉండదేమో..!

Mahesh Sarkaru Vaari Paata Poster Record In Tollywood Industry:

Mahesh Sarkaru Vaari Paata Poster Record In Tollywood Industry  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs