Advertisement
Google Ads BL

మహేశ్‌తో మూవీ.. పూరీకి ఇష్టం లేదా!?


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు- డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబో గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్’ చిత్రాలే ఈ కాంబో ఎలా ఉంటుంది అనేదానికి ప్రత్యక్ష సాక్ష్యం. ‘పోకిరి’ సినిమా మహేశ్‌ను సూపర్ స్టార్ చేయగా.. ‘బిజినెస్‌మెన్’ మహి బిజినెస్‌ను మరింత పెంచింది. అయితే ఈ కాంబోలో ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ చిత్రం ఎప్పుడొస్తుందా..? అని అటు మహేశ్ వీరాభిమానులు.. ఇటు పూరీ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఈ కాంబోలో చిత్రంపై మహేశ్ పెదవి విప్పి మాట్లాడారు కానీ.. పూరీ మాత్రం దీనిపై రియాక్ట్ కాలేదు. 

Advertisement
CJ Advs

నేను కూడా వెయిటింగ్..

‘సర్కారు వారి పాట’ టైటిల్ లుక్ రిలీజ్ అనంతరం మే-31న అభిమానులతో ఆన్ లైన్‌లో చిట్ చేసిన మహేశ్.. పూరీతో సినిమా మీ సినిమా గురించి చెప్పండి..? అని ఓ వీరాభిమాని ప్రశ్నించాడు. ఇందుకు ఆయన స్పందిస్తూ..నవ్వుతూ.. ఖచ్చితంగా పూరి దర్శకత్వంలో ఫ్యూచర్‌లో నా మూవీ ఉంటుంది. నాకు ఇష్టమైన దర్శకుల్లో పూరి కూడా ఒకరు. ఆయన ఎప్పుడు కథ నేరేట్ చేస్తారో అని నేను కూడా వెయిటింగ్ అని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సమాధానంతో మహేశ్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. 

వాస్తవానికి.. మహేశ్, పూరీ కలిసి ‘జనగణమన’ చేయాలని ఎప్పుడో అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఆ కథను పవన్ కల్యాణ్‌ ఒప్పుకున్నారని.. కాదు కాదు విజయ్ దేవరకొండ ఒప్పుకున్నాడని.. కేజీఎఫ్ హీరో యష్‌ కూడా విన్నాడని ఇలా చిత్రవిచిత్రాలుగా వార్తలు వినిపించాయి. అయితే తాజాగా అది మరోసారి తెరపైకి వచ్చింది. 

పూరీకి ఇష్టం లేదా!?

మహేశ్‌తో ముచ్చటించిన అభిమానులు.. పూరీని కూడా ట్యాగ్ చేస్తూ సార్ మీరేమంటారు..? అని అడిగారు. అయితే ఆయన మాత్రం అస్సులు స్పందించలేదు. అంతేకాదు.. మహేశ్‌తో మూవీ ఇష్టం లేదన్నట్లుగా స్పందించలేదు. దీంతో మరోసారి పూరీని మహేశ్ ఫ్యాన్స్ కొందరు తిడుతుండగా.. మరికొందరు టైమ్ వచ్చినప్పుడు చెబుతాడుగా వెయిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. డైరెక్టర్‌ పరశురామ్‌ టైటిల్‌పై మాత్రమే పూరీ స్పందించారు. ‘పరశురామ్.. చిన్నప్పటి నుంచి నీ ప్రయాణం చాలా దగ్గర నుంచి చూస్తున్నాను. ‘సర్కారు వారి పాట’ నీ ప్రయాణంలో మరో మైల్‌స్టోన్ చిత్రంగా నిలిచిపోతుంది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ చాలా బాగున్నాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ సంబరాలకు సిద్ధం అవ్వండి.’ అని పూరి సింపుల్‌గా మాట్లాడేసి.. సినిమాపై మాత్రం పెదవి విప్పలేదు. మరి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలో.. ఉంటో!

News About Puri-Mahesh Movie Update!?:

News About Puri-Mahesh Movie Update!?  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs