Advertisement
Google Ads BL

నాగబాబు వ్యాఖ్యలపై ఛీ..ఛీ నేను మాట్లాడటమేంటి!


టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎం కేసీఆర్‌లతో సినీ పెద్దల భేటీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించి.. ‘బాలకృష్ణ వెంటనే ఇండస్ట్రీకి, తెలంగాణ ప్రభుత్వానికి సారీ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ వేదికగా నాగబాబు వ్యాఖ్యలపై.. అదే విధంగా సినీ పెద్దల భేటీపై మరోసారి బాలయ్య స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారు..? నాగబాబుకు కౌంటర్ ఇచ్చారా..? లేదా..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Advertisement
CJ Advs

నాకే సపోర్టు..!

‘నేనేం మాట్లాడలా.? ఆయనే (నాగబాబే) మాట్లాడుతున్నాడు. చీ.. ఛీ నేనేం మాట్లాడలేదు. అస్సలు నేను మాట్లాడటమేంటి..?. ఇప్పుడు మాట్లాడటానికి కూడా ఏముంది..?. ఇండస్ట్రీ అంతా ఆల్ మోస్ట్‌ ఇవాళ నాకు సపోర్టుగానే వస్తోంది.. మాట్లాడుతోంది. ఇక నేనెందుకు మాట్లాడాలిఅని నాగబాబు వ్యాఖ్యలపై బాలయ్య చెప్పుకొచ్చారు. అయితే ఆ భూముల గురించి ఇప్పుడు మాట్లాడాలని బాలయ్యను అడగ్గా.. అలా ఇలా కాసేపు తల ఊపి మౌనంగా నవ్వేసి ఊరుకున్నారంతే.

అంతటితో ఆగని ఆయన.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో విబేధాలపై కూడా పెదవి విప్పారు. అసలు తాను ఇదివరకేమైనా చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్‌ గారికి తన మీద ఎప్పుడు కోపం లేదన్నారు. అంతేకాదు.. అదంతా రాజకీయాలు.. రాజకీయాలే అని చెప్పుకొచ్చారు. ‘అందుకే చెబుతున్నా హిప్పోక్రసీ, సైకో ఫ్యాన్సీ. నన్ను వేరుగా చేస్తే మాత్రం తిక్కరేగుతుంది. కేసీఆర్ గారికి నాపైన అలాంటిదేమీ లేదు. నాన్నగారు ఎన్టీఆర్ అభిమానిగా ఆయన.. నేనంటే పుత్ర వాత్సల్యం ఉంది. కేసీఆర్‌కు నా మీద అలాంటి అభిప్రాయం ఏమీ ఉండదు’ అని బాలయ్య చెప్పుకొచ్చారు. అయితే.. బాలయ్య వర్సెస్ నాగబాబు వివాదం ఇంతటితో సద్దుమణిగింది అనుకోవచ్చేమో మరి.

Balayya Reacts On Nagababu Comments!:

Balayya Reacts On Nagababu Comments!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs