Advertisement
Google Ads BL

తేజ దర్శకత్వంలో అనుష్క..?


నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ అందుకున్న సీనియర్ దర్శకుడు తేజ, కాజల్ తో తీసిన సీత సినిమాతో మళ్ళీ ట్రాక్ తప్పాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ ప్రధాన పాత్ర పొషించింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యాక తేజ రెండు స్క్రిప్టులని రెడీ చేశాడు. రాక్షసరాజ్యంలో రావణాసురుడు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రం ఒకటైతే ఆలివేలుమంగ వెంకటరమణ రెండవది.

Advertisement
CJ Advs

సినిమా పేర్లైతే బయటకి వచ్చాయి కానీ ఈ సినిమాల్లో హీరో హీరోయిన్లు ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు.రాక్షసరాజ్యంలో రావణాసురుడు సినిమాలో రానా హీరోగా నటించనున్నాడని, అలాగే అలివేలుమంగ వెంకటరమణ సినిమాలో గోపీచంద్ నటించనున్నాడని అంటున్నారు. అయితే తాజా అలివేలుమంగ వెంకటరమణ సినిమా నుండి అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క లేదా కాజల్ ని తీసుకోవాలని చూస్తున్నారట.

టైటిల్ చూస్తుంటే ఫ్యామిలీ డ్రామాగా అనిపిస్తున్న ఈ కథలో వీరిద్దరిలో ఎవరో ఒకరైతే బాగుంటుందని తేజ భావిస్తున్నాడట. అయితే కాజల్ కి ఉన్న కమిట్ మెంట్ల వల్ల తేజ సినిమాలో నటించే అవకాశం తక్కువే. సో అనుష్కని ప్రిఫర్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి స్వీటీ ఈ సినిమా ఒప్పుకుంటుందా లేదో..! గతంలో గోపీచంద్ సరసన చాలా సినిమాల్లో నటించిన అనుష్క ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుందా లేదా చూడాలి.

Anushka would be the heroine in Tejas film..?:

Anushka would be the heroine in Tejas film..?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs