మహేష్ బాబుతో పోకిరి - బిజినెస్ మ్యాన్ అంటూ బ్లాక్ బస్టర్స్ తీసిన దర్శకుడు పూరి జగన్నాధ్ మహేష్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు జనగణమన సినిమా కథతో ఆయనను కలవడం, మహేష్ చేద్దాం చూద్దాం అంటూ పూరి ని తిప్పుకుని.. చివరికి రిజెక్ట్ చెయ్యడం.. తర్వాత పూరి జగన్నాధ్.. మహేష్‌ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీంతో మహేష్‌కి పూరికి మధ్యన ఏం జరిగిందో అనేది అధికారికంగా తెలియకపోయినా.. ఆ విషయంపై అందరిలో ఓ క్లారిటీ ఉంది. ఇక పూరికి మహేష్ ఓకె చెప్పలేదనే కసి పూరిలో ఉండనే ఉంది. అవకాశం వచ్చినప్పుడు పూరి ఇండైరెక్ట్‌గా మహేష్ ని పంచ్ లతో ఆడుకుంటున్నాడు. పూరి మాత్రం మహేష్ తోనే జనగణమన అంటూ కూర్చున్నాడనే టాక్ ఉంది.
అయితే తాజాగా మహేష్‌ని ఓ అభిమాని ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ కొట్టి విజయ్‌తో పాన్ ఇండియా మూవీ చేస్తున్న పూరి జగన్నాధ్ తో భవిష్యత్తులో మూవీ ఎప్పుడూ ఉంటుంది. మూవీ ఉంటుందా? అని అడగగా.. మహేష్ మాత్రం నవ్వుతూ ఖచ్చితంగా పూరి దర్శకత్వంలో ఫ్యూచర్ లో నా మూవీ ఉంటుంది. నాకు ఇష్టమైన దర్శకుల్లో పూరి కూడా ఒకరు. ఆయన ఎప్పుడు కథ నేరేట్ చేస్తారో అని నేను కూడా వెయిటింగ్ అంటూ మహేష్ పూరికి డైరెక్ట్‌గానే షాకిచ్చాడు. మరి మహేష్ చేసిన పనికి పూరి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.