అలవైకుంఠపురములో సినిమాలోని అన్ని పాటలకి సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. థమన్ స్వరపరిచిన ఈ పాటలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సామజవరగమనా మొదలుకుని బుట్టబొమ్మ సాంగ్ వరకూ ప్రతీ పాటకి యూట్యూబ్ లో మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఎక్కువ రెస్పాన్స్ తెచ్చుకున్న పాట మాత్రం బుట్టబొమ్మ సాంగే అని చెప్పుకోవాలి.
అలవైకుంఠపురములో ఆల్బమ్ వన్ బిలియన్ వ్యూస్ దక్కించుకుని రికార్డు క్రియేట్ చేసింది. అయితే వీటిల్లో బుట్టబొమ్మ వీడియో సాంగ్ 200 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. సాధారణంగా ట్యూన్ బాగుంటే లిరికల్ సాంగ్ కే ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి. ముందుగా లిరికల్ సాంగ్స్ నే రిలీజ్ చేస్తుంటారు కాబట్టి దానికే ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి. ఆ తర్వాత వీడియో సాంగ్ రిలీజ్ చేసినా ఆ పాటికే లిరికల్ రూపంలో వినేసి ఉంటారు కాబట్టి వీడియో సాంగ్ ని అంతగా పట్టించుకోరు.
కానీ బుట్టబొమ్మ సాంగ్ కి ఇది రివర్స్ లో జరిగింది. బుట్టబొమ్మ లిరికల్ సాంగ్ కి వచ్చినదానికంటే వీడియో సాంగ్ కే ఎక్కువ రెస్పాన్స్ రావడం ఆశ్చర్యకరం. అయితే ఇక్కడే ఓ విషయం గుర్తుంచుకోవాలి. బుట్టబొమ్మ వీడియో సాంగ్ ని అంతగా చూడడానికి కారణం బన్నీ డాన్సులే. బుట్టబొమ్మ పాటకి వేసిన సెట్, బన్నీ చేసిన స్టైలిష్ డాన్స్ ఆ సాంగ్ ని మళ్ళీ మళ్ళీ చూసేలా చేసాయి. దాంతో లిరికల్ సాంగ్ ని మించి వ్యూస్ వచ్చాయి.