Advertisement
Google Ads BL

ఓటిటి వాళ్లు.. ఇప్పుడు ఆలోచనలో పడ్డారు


ఇప్పుడు కరోనా లాక్‌డౌన్ కారణంగా చాలామంది చిన్న నిర్మాతలు ఓటిటి ఒత్తిడికి తలొగ్గడం అటుంచి.. సినిమాల బడ్జెట్‌కి పెట్టిన డబ్బుకి వడ్డీలు కట్టలేక ఓటిటి ప్లాట్ ఫామ్‌లో సినిమాని విడుదల చేసేందుకు ఒప్పేసుకుంటున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు ఓటిటి ఒత్తిడికి తలొగ్గడం లేదుకానీ.. చిన్న చితక, మీడియం రేంజ్ నిర్మాతలు కూడా ఓటిటి ఇచ్చే ఆఫర్స్‌కి పడిపోతున్నారు. థియేటర్స్ ఎలాగూ మూతవేసి ఉన్నాయి. అందుకే ఆఫర్స్ తో పడగొడితే నిర్మాతలు ఒంగుతారని ఓటిటి వాళ్ళు సినిమాల కోసం ఎగబడ్డారు. అలా పడగొట్టిన తమిళ హీరో సూర్య తన భార్య జ్యోతిక నటించిన సినిమాని ఓటిటిలో తాజాగా విడుదల చేసాడు.

Advertisement
CJ Advs

అలాగే మొన్నామధ్యన అమృత రామమ్ అనే సినిమా. ఇప్పుడు బాలీవుడ్ లో అక్షయ్ కుమర్ ‘లక్ష్మీ బాంబ్’ సినిమా కూడా ఓటిటిలో నేరుగా విడుదలకాబోతుంది. అయితే ఇప్పటివరకు ఓటిటిలో విడుదలైన సినిమాలేవీ బ్లాక్ బస్టర్ అవలేదు. రెండు నెలల క్రితం ఓటిటి లో నేరుగా విడుదలైన అమృత రామమ్ కి సో సో టాక్ రాగా.. తాజాగా జ్యోతిక నటించిన పొన్ మగళ్ వందాళ్ యావరేజ్ టాక్ మాత్రమే కాదు.. యావరేజ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విపరీతంగా ప్రచారం చేసుకుని మరీ ఓటిటిలో విడుదలైంది. ఇక జీ 5 లో విడుదలైన మరో సినిమా కూడా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో.. ఇప్పుడు ఓటిటి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, సన్ నెట్, జీ 5 వాళ్ళు కూడా ఆచి తూచి సినిమాలను కొనేందుకు చూస్తున్నారట.

OTT platforms in Deep Thinking:

OTT platforms not Suitable for Release Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs