మహేష్ బాబు తన తదుపరి సినిమా విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఆ న్యూస్ ఏదోలా మీడియాకి పాకేస్తుంది. తాజాగా పరశురాం తో అధికారిక ప్రకటన చెయ్యకుండా తాత్సారం చేస్తూ ఫాన్స్ ని ఊరిస్తున్న మహేష్ బాబు రేపు తన కొత్త సినిమాని మొదలు పెట్టబోతున్నాడు. గ్రాండ్ గా ఓపెనింగ్ చేద్దామని భావిస్తే కరోనా కంగారు పెడుతుంది. అయితే సినిమా ఓపెనింగ్ రోజునే సినిమా టైటిల్ ని కూడా గ్రాండ్ గా ప్రకటిద్దామనుకుంటే.. గత రెండు రోజులుగా మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
మహేష్ - పరశురామ్ టైటిల్ గా సర్కార్ వారి పాట అనే టైటిల్ మహేష్ సినిమా కి పెట్టబోతున్నట్టుగా ప్రచారం జరగడంతో.. మహేష్ కి కోపమొచ్చిందట. టైటిల్‌ని గోప్యంగా ఉంచి.. గ్రాండ్ గా ప్రకటిద్దామంటే ఈ లీకులేమిటి అంటూ దర్శకనిర్మాతలపై మహేష్ కోప్పడినట్లుగా మీడియా టాక్. ఇక ఈ సినిమా కథపై మరో క్రేజీ రూమర్ వాడుకలోకొచ్చింది. అదేమంటే ఈ సినిమాలో మహేష్ బాబు త్రిపాత్రాభినయం చేయబోతున్నాడని, అందుకే కరోనా లాక్ డౌన్ సమయంలో మహేష్ మీసాలు, గెడ్డాలు తీసేసి మేకోవర్ అవుతున్నాడని అంటున్నారు. మూడు భిన్న నేపధ్యాలు, వయసులలో మహేష్ పాత్రలు ఉంటాయని అందుకే ఇలా తెగ మేకోవర్ అవుతున్నాడని సదరు వార్తల సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియదట కానీ.. అదే కనుక నిజం అయితే, మహేష్ చేస్తున్న మొదటి ట్రిపుల్ రోల్ ఈ సర్కార్ వారి పాట చిత్రమే అవుతుంది.