Advertisement
Google Ads BL

3వ వర్ధంతి సందర్భంగా దాసరికి నివాళులు


పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా దర్శకరత్న దాసరి నారాయణరావు 3వ వర్ధంతి కార్యక్రమం

Advertisement
CJ Advs

దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి 3వ వర్ధంతి సందర్భంగా ఫిలింఛాంబర్ లో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన హీరో శ్రీకాంత్, నిర్మాత సి.కళ్యాణ్, దర్శక నిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ, దర్శకులు రేలంగి.నరసింహారావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు.

ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ...కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీలో జరిగిన నష్టాన్ని దాసరి గారు ఐతే వేరే రకంగా కాపాడేవారు, దాసరి గారిని తలుచుకొని రోజు ఉండదు, ఏ సమస్య వచ్చినా ముందువుండే వ్యక్తి దాసరి గారు అన్నారు. ఆయన లేని లోటు కనిపిస్తోంది. ఈరోజు ఆయన మూడో వర్ధంతి సందర్భంగా 200 నుండి 300 మందికి అన్నదానం చేస్తున్నాము. వచ్చే ఏడాది మరింత ఘనంగా చేస్తామని తెలిపారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..ఇండస్ట్రీకి పెద్ద దిక్కు దాసరి గారు, ఎటువంటి విషయాలు అయినప్పటికీ వ్యవస్థలను ముందు పెట్టి ఆయన నడిపించేవారు. ప్రతి సినిమా టెక్నీషియన్ కు నటుడికి విలువ ఇచ్చి మాట్లాడేవారు. ఆయన లేని లోటు తెలుస్తోంది. ఈ కరోనా సనయంలో మరింత ఆయన లోటు కనిపిస్తోంది. ఆయన స్థానాన్ని ఎవ్వరూ బర్తీ చెయ్యలేరని తెలిపారు.

తుమ్మలపల్లి రామ సత్యనారాయణ.. దాసరి గారి మీద వున్న అపారమైన ప్రేమతో ఈ రోజు ఆయన 3వ వర్ధంతి కార్యక్రమాన్ని కొనసాగించాము. నేను బతికి ఉన్నత కాలం దాసరి గారి పుట్టినరోజు మే 4 దాసరి గారి వర్ధంతి మే 30 కచ్చితంగా ఇక్కడ జరుపుకుంటాను ప్రతి సంవత్సరం దాసరి అవార్డ్స్ కొనసాగించుతాను, ఈ ఫంక్షన్ ను దాసరి కుటుంబ సభ్యులు, మరియు శిష్యులు సమక్షంలో చేస్తానని తెలిపారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. దాసరి గారి లేని లోటు పూడ్చలేము ఇక్కడ ఉన్న నేను కానీ సి.కళ్యాణ్ కానీ రామ సత్యనారాయణ కానీ ఆయన దగ్గర పనిచేయలేదు అయినాసరే ఆయన మనుష్యులు మే అని గర్వంగా చెప్పుకుంటాం. ఆయన వర్ధంతి రోజున ఇలా ఆయనను స్మరించుకుంటూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహారావు, దొరై రాజా వన్నేం రెడ్డి , సత్తుపల్లి తాండవ,  పిడివి ప్రసాద్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. దాసరి నారాయణ రావు 3వ వర్ధతి సందర్భంగా 300 ఆహార పొట్లాలు, స్వీట్స్ పంచిపెట్టడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు రామ సత్యనారాయణ. 

Dasari Narayana Rao 3rd Death Anniversary Event details :

Celebrities celebrates Dasari Narayana Rao 3rd Death Anniversary
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs