Advertisement
Google Ads BL

నిజంగా అక్షయ్ కుమార్ గ్రేటబ్బా.. !


బాలీవుడ్‌లో ఖాన్స్ త్రయాన్ని తట్టుకుని స్టార్ రేంజ్‌కి ఎదిగిన అక్షయ్ కుమార్ పేదలకు సహాయం చెయ్యడంలో అందరికన్నా ముందుంటాడు. గత కొన్ని ఏళ్లుగా ఖాన్స్ త్రయాన్ని పడుకోబెట్టి బ్లాక్ బస్టర్స్ కొడుతున్న అక్షయ్ కుమార్ కరోనాతో ఇబ్బందులు పడుతున్న పేదలకు 30 కోట్లు విరాళం ప్రకటించి అందరికి షాకిచ్చాడు. అయితే అలాంటి అక్షయ్ కుమార్ కోట్లలో సంపాదిస్తాడు. అలాగే కోట్లలో ఖర్చు పెడతాడు అనుకుంటారు అందరూ. కోట్లలో పారితోషకం అందుకునే అక్షయ్ కుమార్ నెలకి ఖర్చు చేసే ఖర్చు చూస్తే నోట మాటరాదు.

Advertisement
CJ Advs

అంటే అక్షయ్ కుమార్ రేంజ్ ని అబట్టి అక్షయ్ కుమార్ కోట్లలో ఖర్చు బెడతాడు. లక్షల్లో మెయింటినెన్స్ ఉంటుంది అనుకుంటారు. కానీ అక్షయ్ కుమార్ ఖర్చు పెట్టె ఖర్చు కేవలం వేలల్లో. అది కూడా పది వేలంటే అందరికి షాక్. మందు తాగడు, సిగరెట్ తాగడు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమర్ ఉదయమే 4 గంటలకు నిద్రలేచి... జాగింగ్ చేసి టైం కి షూటింగ్ స్పాట్ కి వెళ్ళిపోతాడట. ఎందుకంటే హీరో గారు లేటయితే నిర్మాతలకు తడిసిమోపుడవుతుంది కాబట్టి. అందుకే అక్షయ్ టైం కి షూటింగ్ కి వెల్తాడట. అలాగే సాయంత్రం 6 తర్వాత ఎవ్వరు బ్రతిమాలినా షూటింగ్ చెయ్యడట. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడట.

పడుకునే ముందు భార్య తో అక్షయ్ కుమార్ పేకాట(రమ్మీ) ఆడతాడట. ఇప్పటికి భార్య కి అక్షయ్ నాలుగున్నర లక్షల బాకీ ఉన్నానని చెబుతున్నాడు. ఇక తన నెలసరి ఖర్చు కేవలం పది వేలు ఉంటుంది అని.. ఒకవేళ ఖర్చు పెరిగితే ఓ రెండు వేలు అటు ఇటు ఉంటుంది అని.. సిగార్ కాల్చను, మద్యం ముట్టను, షూటింగ్స్ కి వెళితే నా ఖర్చు నిర్మాతలే పెడతారు.. కాబట్టి నా నెల ఖర్చు పది వేలు ఉంటుంది అని చెప్పి సంచలనం సృష్టించాడు. మరి ఆ రేంజ్ హీరో కేవలం పది వేలు ఖర్చు అంటే నమ్మకం కలగడం లేదు కదూ.

Again Akshay Kumar Greatness Revealed :

akshay kumar monthly expenses in Only thousands 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs