Advertisement
Google Ads BL

జబర్థస్త్: కోత మొదలైంది.. రోజా ఉంటుందా?


రోజా ఇప్పుడు అటు రాజకీయాలు, ఇటు ఈటీవీ స్పెషల్ ప్రోగ్రామ్స్, జబర్దస్త్ లతో యమా బిజీ. కరోనా లాక్ డౌన్‌తో షూటింగ్స్ నిలిచిపోవడంతో... రోజా నగరిలోనే ఉంటూ అక్కడ కరోనా లాక్ డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేస్తూ వైసిపిలో జగన్ తర్వాత నేనే అన్నంతగా హైలెట్ అవుతుంది. అయితే తాజాగా జబర్దస్త్‌లో రోజాకి గడ్డుకాలమే అంటున్నారు. ఎందుకంటే గతంలో జబర్దస్త్ కి పనిచేసిన వాళ్లంతా రెండు చేతులా సంపాదిస్తున్నారు. జబర్దస్త్ లో పనిచేసే కమెడియన్స్, టెక్నీకల్ టీం ఇలా ఎవరికీ వారే పారితోషకాలతో కళకళలాడారు. ఇక రోజా రాజకీయాలతో యాక్టీవ్ అయినా.. జబర్దస్త్‌ని వదల్లేదు. కారణం పారితోషకం, క్రేజ్. తాజాగా నాగబాబు బయటికెళ్ళిపోయినా.. రోజాని భారీ పారితోషకంతో జబర్దస్త్ నిర్వాహకులు కట్టిపడేసారు.

Advertisement
CJ Advs

అయితే కరోనాతో షూటింగ్స్ వాయిదా పడి.. క్రేజ్ కోల్పోయిన జబర్ధస్త్ మళ్లీ షూటింగ్ మొదలైనా మునుపటి వైభవం ఉండకపోవచ్చు అంటున్నారు. కరోనా లాక్ డౌన్ కాలంలో అడ్వర్టైజ్‌మెంట్స్‌లో భారీగా కోత పడే ఛాన్స్ ఉంది అంటున్నారు నిపుణులు. దానితో భారీ పారితోషికాలు అందుకుంటున్న ఆర్టిస్టులను కాస్త పారితోషకం తగ్గించుకోవాలని యాజమాన్యం ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అలాగే జడ్జ్ రోజాకి కూడా ఈమేరకు సూచనలు అందినట్లుగా.. ఆమె పారితోషకంలో కూడా కోత పడినట్లుగా టాక్. అయితే రాజకీయాలతో బిజీగా ఉండే రోజా.. జబర్దస్త్ ని చేస్తున్నది ఫేమ్ కోసం, పారితోషకం కోసమే. మరి ఆ పారితోషకంలో కోత పడితే రోజ ఒప్పుకుంటుందా.. అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. 

Changes in Jabardasth with Corona Effect :

Cuttings in Jabardasth.. doubts on Roja
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs