Advertisement
Google Ads BL

నా వరకు నిర్మాతలు ఏదంటే అదే..: రకుల్


ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ అన్ని మూతపడ్డాయి. గత రెండు నెలలుగా అన్ని బ్రేకులే. అయితే ప్రస్తుతం సినిమా థియేటర్స్ సంగతి అటుంచి.. షూటింగ్స్ కి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు అనుమతులనివ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే థియేటర్స్‌ని కూడా ఒకేసారి దేశం మొత్తం ఓపెన్ చెయ్యాలని చూస్తుంది. కానీ అది ఎప్పుడో తెలియదు ఈలోపు సినిమాలను ఓటీటీలలో విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాకపోతే నిర్మాతలు నష్టపోతున్నామని ఓటీటీకి టెంప్ట్ అవుతుంటే హీరో హీరోయిన్స్ మాత్రం ఓటీటీ సమస్యే లేదు, థియేటర్స్ లోనే సినిమాలు విడుదలవ్వాలని పట్టుబడుతున్నారు.

Advertisement
CJ Advs

కానీ తాజాగా రకుల్ ప్రీత్ మాత్రం సినిమా ఓటీటీలో విడుదలవ్వలా? లేదంటే థియేటర్స్‌లో విడుదలవ్వలా? అనేది నిర్మాతల ఇష్టం అని. వారే సినిమాని నిర్మించి బడ్జెట్ పెడతారు కనుక అది వారిష్టం అంటుంది. సినిమా షూటింగ్స్ మొదలైనప్పటికీ... కరోనా వలన 100 మంది షూటింగ్స్‌లో పాల్గొనాలంటే కుదరదని... ముందుముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలని అంటుంది. ఇక తాను నటించిన రెండు సినిమాలు షూటింగ్స్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమయ్యాయని.. ఎటాక్ సినిమాతో పాటుగా అర్జున్ కపూర్ తో కలిసి నటించిన సినిమా కూడా విడుదల కావాల్సి ఉందని.... ఇక సౌత్ లో ఓ సినిమా షూటింగ్ చెయ్యాల్సి ఉందని చెబుతుంది.

ఇక ఆయా ప్రదేశాల నిబంధనల్ని బట్టి డేట్స్ సర్దుబాటు చేసుకోవాలని చెబుతుంది. ఇక తన సినిమాలు ఏ ప్లాట్ ఫారంలో విడుదలైనా తనకి ఎటువంటి అభ్యంతరం లేదని.. సూర్యవంశీ లాంటి సినిమాలు పెద్ద తెర మీద చూస్తేనే బావుంటుంది అని కానీ ఈ విషయంలో తుది నిర్ణయం నిర్మాతలదే అంటుంది. ఎందుకంటే నిర్మాతలు కష్టోడ్చి బడ్జెట్ పెడతారు. సినిమాకి ఎంత మొత్తం అవుతుంది.. అనేది నిర్మాతలకి తెలుసు. కనకనే వారు ఇప్పుడు ఓటీటీకి మొగ్గు చూపుతున్నారు. అయినా వారు థియేటర్ లో విడుదల చెయ్యాలా ఓటీటీ లో విడుదల చెయ్యాలా అనేది వారి ఆలోచన బట్టి ఉంటుంది.. అయినా పరిస్థితులన్నీ చక్కబడి సినిమాలన్నీ థియేటర్స్‌లోనే విడుదల కావాలని కోరుకుందాం అంటుంది.

Rakul Preet Singh Reaction on OTT And Theaters:

Producer Decision is Final says Rakul preet singh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs