Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి ఒంటరిగా నటి నివాళులు


మే-28న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడు నందమూరి తారక రామారావు జయంతి. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, నారా, నందమూరి కుటుంబాలు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. అనంతరం తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్‌ గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోగా.. మరికొంత తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ ట్వీట్స్ చేశారు. అయితే.. టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్ మాత్రం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఒంటిరిగా వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్‌కు అంజలి ఘటిస్తున్న వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకుంది.

Advertisement
CJ Advs

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? ఆమెకు ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధమేంటి..? అనుకుంటున్నారా..? ఆ భామే పూనమ్ కౌర్. నివాళులు అర్పించిన అనంతరం ట్విట్టర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ఎన్టీఆర్‌ను తెలుగు ప్రజల దేవుడు అని అభివర్ణించింది. ‘స్వర్గంలో ఉన్న మీరు నన్ను ఆశీర్వదించండి. దుష్ట శక్తులతో పోరాడే ధైర్యాన్నిచ్చేలా దీవించండి. మానవత్వం బొత్తిగా కరవైన ఈ రోజుల్లో మీ వంటి నేతలు, మీ వంటి నటుల అవసరం ఎంతో ఉంది’ అని తీవ్ర భావోద్వేగంతో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు పలువురు నందమూరి వీరాభిమానులు స్పందిస్తూ మీరు నిజంగా గ్రేట్ మేడం అని ప్రశంసలతో ముంచెత్తుతుండగా.. మరికొందరు మాత్రం ‘ఇంత ప్రేమ ఎప్పటి నుంచి మేడం గారు?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.

 

వీడియో కోసం క్లిక్ చేయండి..

Actress Poonam Kaur On Sr Ntr Jayanthi:

Actress Poonam Kaur On Sr Ntr Jayanthi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs