Advertisement
Google Ads BL

డేటింగ్, పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన శ్రీముఖి!


బుల్లితెర రాములమ్మ, బిగ్‌బాస్ మూడో సీజన్ రన్నర్ శ్రీ ముఖి గురించి సినీ ప్రియులకు ప్రత్యేకించి మరీ పరిచయం చేయనక్కర్లేదు. అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై చిన్న చిన్న పాత్రలతో ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఈ భామకు యమా ఫాలోయింగ్ కూడా ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్‌ కావడంతో టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ లాక్ డౌన్ జంటలను కలుపుతుండగా.. కొత్త జంటలను పుట్టిస్తోంది. ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ పెళ్లి అయిపోగా.. నితిన్, రానా రెడీ అయ్యారు. మరోవైపు ఇంకొందరు పెళ్లి చూపులతో బిజీగా ఉన్నారు. తాజాగా.. శ్రీముఖి పెళ్లిపై వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement
CJ Advs

శ్రీముఖి ఓ ప్రముఖ నటుడితో ఎప్పట్నుంచో డేటింగ్‌లో ఉందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు త్వరలోనే వారిద్దరూ ఒక్కటవుతారని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత శ్రీముఖి బిగ్‌బాస్‌కు వెళ్లడం అక్కడ లవ్ స్టోరీ చెప్పి ఎమోషనల్ అవ్వడంతో అబ్బే డేటింగ్ లేదు.. పెళ్లి లేదని అందరూ మిన్నకుండిపోయారు. తాజాగా మరోసారి పుకార్లు రావడంతో ఎట్టకేలకు ఈ అల్లరి పిల్ల స్పందించింది. చాలా రోజులగా ఈ విషయంపై తాను రియాక్ట్ అవ్వాలని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కదా అని రియాక్ట్ అవుతున్నట్లు చెబుతూ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టేసింది. 

‘నేను ఎవ్వరితోనూ ప్రేమ‌లో ప‌డ‌లేద‌ు. డేటింగ్‌లూ చేయ‌డం లేద‌ు. ప్రస్తుతానికి సింగిలే. ఇంట్లోవాళ్లు ఓకే చేసిన అబ్బాయితోనే నా పెళ్లి జ‌రుగుతుంది. ప్రస్తుతానికి పెళ్లి విష‌యంలో తొంద‌రేం లేద‌ు. కరోనా లాక్ డౌన్ టైమ్‌లో కొన్ని స్క్రిప్టులు త‌యారు చేశాన‌ు. మ‌ళ్లీ షూటింగులు ఎప్పుడు మొద‌ల‌వుతాయా..? అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాన‌ు’ అని ఓ ఇంటర్వ్యూ వేదికగా శ్రీముఖి చెప్పేసింది. సో.. ఇన్నాళ్లుగా వచ్చిన డేటింగ్, పెళ్లి పుకార్లపై ఎట్టకేలకు తెరదించేసిందన్న మాట.

Sreemukhi gives Clairty On her Dating And Marriage:

Sreemukhi gives Clairty On her Dating And Marriage  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs