తెలుగు యూట్యూబ్ చానెల్స్‌లో ఈ మధ్య ఎక్కువగా కనపడిన.. వినపడిన పేరు రాకేష్ మాస్టర్. ఒకప్పుడు మంచి కొరియోగ్రఫర్‌గా పేరు తెచ్చుకున్న ఈయన.. ఇప్పుడు ఇష్టానుసారం ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరోలు ఆఖరికి మెగాస్టార్ చిరంజీవిపై నోరు పారేసుకుంటున్నాడు. ఇలా కాంట్రవర్సీ క్వీన్ శ్రీరెడ్డి గురించి ఇష్టానుసారం మాట్లాడినందుకే ఆమెకు చిర్రెత్తుకురావడంతో అప్పట్లో పెద్ద గొడవే జరిగింది. దీంతో రాకేష్ మాస్టర్‌కు లీగల్ నోటీస్ కూడా పంపించింది. అప్పట్నుంచి శ్రీరెడ్డి పేరేత్తనే లేదు.. కానీ తన అతి మాత్రం అస్సలు తగ్గించుకోలేదు. తాజాగా హీరోయిన్ కమ్ బీజేపీ నేత మాధవి లతపై అనుచిత వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యాడు.
దీంతో.. మాస్టర్‌పై మాధవి సీరియస్ అయ్యింది. రాకేష్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని.. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేనిచో వెంటనే న్యాయ పరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఈ మేరకు నోటీసులో పేర్కొంది. తాను లీగల్‌గా వెళితే మాత్రం కోర్టు మెట్లు ఎక్కించేదాకా ఊరుకోనని మాస్టర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
కాగా.. ఈ నెల 6న కొన్ని యూట్యూబ్ చానెల్స్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రముఖ హీరోలతో మాధవికి లింకులు పెడుతూ తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. దీంతో తనపై అసత్య ఆరోపణలు చేసిన మాస్టర్‌పై పై విధంగా ఆమె రియాక్ట్ అయ్యింది. సో.. ఇకనైనా మాస్టర్ అతి తగ్గించుకుని అణిగి మణిగి ఉంటాడో చూడాలి. ఇలానే మాట్లాడుతూనే పోతే మాత్రం ఎక్కడో ఒక చోట బ్రేక్ పడుతుంది.. అప్పుడిక తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే మరి.