Advertisement
Google Ads BL

ఈ ఆంటీ సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనుందా!?


ఆర్టిస్ట్‌ సురేఖా వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేదు. ఎన్నో సినిమాల్లో అక్కగా, చెల్లి, తల్లి పాత్రల్లో నటించి మెప్పించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ ఒకప్పుడు యమా బిజీగా గడిపింది. ప్రస్తుతం మునుపటిలా పాత్రలు రావట్లేదు ఈ ఆంటీకి. రెండేళ్లుగా ఈ ఆంటీకి తగిన పాత్రలు రాకపోవడంతో సోషల్ మీడియాలో యమా యాక్టివ్ అయిపోయింది. అయితే ఈ గ్యాప్‌లో బాగా ఆలోచించుకున్న సురేఖ తాను ఎలా అయితే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానో.. తిరిగి అక్కడికే చేరుకోవాలని ప్లాన్ చేస్తోందట.

Advertisement
CJ Advs

వాస్తవానికి.. సురేఖా వాణి కెరీర్ ప్రారంభమైందే బుల్లితెర నుంచే అన్న విషయం విదితమే. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సురేఖకు డైరెక్టర్ సురేష్ తేజ ‘మొగుడ్స్ పెళ్లామ్స్’, ‘హార్ట్ బీట్’ వంటి షోలలో అవకాశం ఇవ్వడంతో తనేంటో నిరూపించుకుని మంచి పాపులారిటి సంపాదించుకుంది. ఆ తర్వాత తనకు లైఫ్ ఇచ్చిన సురేష్ తేజనే ఆమె పెళ్లాడింది. గత ఏడాది మే-06న సురేష్ తేజ కన్నుమూశారు. వీరికి కుమార్తె ఉంది. కుమార్తె సుప్రీతను హీరోయిన్‌గా పరిచయం చేయాలని ఆంటీ తెగ ఆరాటం పడుతోందని తెలియవచ్చింది. అందుకే తనకు ఎలాగో ప్రస్తుతం అవకాశాలు రావట్లేదు గనుక.. టీవీ షోల వైపు వెళ్లాలని.. కుమార్తెను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తోందట.

అంటే.. ఆంటీ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేయనుందన్న మాట. వాస్తవానికి ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న సుమ కనకాల, ఉదయభాను, ఝాన్సీల కంటే ముందుగా సురేఖ సత్తా చాటింది. అయితే సినిమాల్లో వరుస అవకాశాలు రావడంతో బుల్లితెరకు బాయ్ బాయ్ చెప్పేసింది. ఇప్పుడు అదే వెండితెరకు గుడ్ బై చెప్పేసి కుమార్తె కోసం బుల్లితెరకు రావాలని యత్నాలు చేస్తోందట. ఇప్పటికే ఓ పాపులర్ టీవీ యాంకరింగ్‌ కోసం సంప్రదించదని సమాచారం. కాగా.. ఇప్పటికే పలు షార్ట్ ఫిల్మ్స్, టిక్‌టాక్‌లతో సుప్రీత యాక్టింగ్ స్కిల్స్ బయటపెట్టింది. మంచి ఆఫర్ కోసం వేచి చూస్తోంది. మరి ఏ డైరెక్టర్ ఈ ఆంటీ కూతురుకు చాన్స్ ఇస్తాడో.. ఏ మాత్రం రాణిస్తుందో వేచి చూడాలి.

These Aunty Says good Bye To Tollywood!:

These Aunty Says good Bye To Tollywood!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs