Advertisement
Google Ads BL

‘వకీల్‌సాబ్’.. ఈ టాప్ రైటర్‌కి నచ్చేశాడు!


పవన్ కళ్యాణ్ - దిల్ రాజు - వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమా కరోనా అడ్డంకితో విడుదల వాయిదా పడింది. లేదంటే పవన్ ఫ్యాన్స్ ఈపాటికే థియేటర్స్ దగ్గర దుమ్మురేపేవారే. అయితే వకీల్ సాబ్ సినిమాని పవన్ కళ్యాణ్ అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదు. త్రివిక్రమ్ చెప్పాడు.. పింక్ సినిమా చూడమని. పవన్ చూసి సినిమా రీమేక్ ఒప్పుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ కి పింక్ రీమేక్ సూట్ అవదేమో అనుకున్నారు. కానీ పవన్ లుక్ మ్యానరిజం అన్ని ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో ఓ ప్రముఖ సినిమా వ్యక్తి పవన్ కి ఎలాంటి టైటిల్ పెడతారో అని తెగ ఆత్రంగా ఎదురు చూసాడంట. ఆయనెవరో కాదు ప్రముఖ రచయిత, మాటల రచయిత, నటుడు అయిన పరుచూరి గోపాలకృష్ణ.

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చేస్తున్నాడు ఓకే.. ఈ సినిమాకి బాలీవుడ్ లో అమితాబ్ హీరోగా పింక్ అనే టైటిల్ పెట్టారు. అలాగే తమిళనాట అజిత్ హీరోగా నీరుకొండ పర్వాయ్ అనే టైటిల్ పెట్టారు. మరి తెలుగులో ఎలాంటి టైటిల్ పెడతారా అనే ఇంట్రెస్ట్ కలిగింది. పవన్ కళ్యాణ్ అందగాడు. పవన్ చేసిన సూపర్ హిట్ మూవీస్ లో జల్సా, అత్తారింటికి దారేది వంటి చిత్రాలకు ఎక్కడా సినిమాలో పవన్ పేరు వచ్చేలా టైటిల్ పెట్టలేదు. మరి ఈ పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కేరెక్టర్ పేరు ఏమన్నా వాడతారమేమో అనుకున్నా. లైక్.. లాయర్ విశ్వనాధం, లాయర్ భారతి దేవి ఇలా పాత కాలపు టైటిల్స్ ఏమన్నా పెడతారేమో అనుకున్నా. కానీ ఇంట్రెస్టింగ్ గా వకీల్ సాబ్ అంటూ పెట్టేసరికి అబ్బ ఎంత బావుందో అంటూ.. ఈ టైటిల్ ఆలోచన చేసిన వారికి హ్యాట్సాఫ్ అంటున్నాడు పరచూరి గోపాలకృష్ణ.

Click Here for Video

Paruchuri Gopala Krishna reaction on Vakeel saab Title:

Vakeel saab Title Super.. says Paruchuri Gopala Krishna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs