Advertisement
Google Ads BL

అ దర్శకుడు ట్విస్టులనే నమ్ముకున్నాడా..?


నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి నిర్మించిన మొదటి చిత్రం అ. వాల్ పోస్టర్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం అంతగా ఆడకపోయినా విమర్శకుల ప్రశంసలు గెలుచుకుంది. అంతే కాదు మేకప్ విభాగంలో జాతీయ అవార్డుని దక్కించుకుంది. ప్రశాంత్ వర్మ నుండి వచ్చిన ఈ చిత్రంలో క్లైమాక్స్ లోనే అసలు కథ ఏంటనేది తెలుస్తుంది.

Advertisement
CJ Advs

సినిమా కథ ఏంటనేది సినిమా చివరి వరకూ అర్థం కాదు. క్లైమాక్స్ లోనే మర్మాన్ని దాచిన ప్రశాంత్ వర్మ తన రెండవ చిత్రం కల్కిలోనూ అదే రిపీట్ చేశాడు. సినిమాకి కీలకమైన ట్విస్టుకి చివర్లో రివీల్ చేసి ఆహా అనిపించాలని అనుకున్నాడు. అయితే అ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి బాగా ఎగ్జైట్ అయిన జనాలు కల్కి సినిమా క్లైమాక్స్ కి అంతగా ఫీల్ అవలేదు. అయినా కూడా తన మూడవ చిత్రంలోనూ అదే తరహా ట్విస్టు ఉంటుందని చెబుతున్నాడు. 

ప్రశాంత్ వర్మ తన తర్వాత్ చిత్ర ఫస్ట్ లుక్ ని మరికొద్దిరోజుల్లో రివీల్ చేయబోతున్నాడట. గత రెండు సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసినపుడు అందులో క్లైమాక్స్ కి సంబంధించిన ట్విస్ట్ ని హింట్ రూపంలో ఇచ్చాడట. ఈ సారి కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే ట్విస్ట్ కి సంబంధించిన హింట్ ఇవ్వబోతున్నాడట. అంటే ఈ సారి కూడా ప్రశాంత్ వర్మ ట్విస్ట్ నే నమ్ముకున్నాడని అర్థం అవుతుంది. అయితే ప్రతీ సినిమా థ్రిల్లర్ జోనర్ లోనే కాకుండా డిఫరెంట్ జోనర్ లో ప్రయత్నిస్తే బాగుంటుందని సోషల్ మీడియా ద్వారా సలహా ఇస్తున్నారు.

Awe director is continueing his Twists..:

Prashanth Varma is coming again with Thriller movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs