Advertisement
Google Ads BL

సర్కారి వారి పాట అంటున్న మహేష్..?


సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ ఎవరితో సినిమా చేస్తున్నాడనేది ఆసక్తిగా మారింది. గీత గోవిందం పరశురామ్ తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నెల 31వ తేదీన క్రిష్ణగారి పుట్టినరోజుని పురస్కరించుకుని మహేష్ సినిమాపై అప్డేట్ రానుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఆశలు ఫలించే అవకాశం మెండుగా కనిపిస్తుంది.

Advertisement
CJ Advs

మే 31వ తేదీన మహేష్- పరశురామ్ ల కాంబో సినిమా లాంచ్ కానుందట. అప్పుడే ఆ సినిమా టైటిల్ కూడా బయటకి వచ్చేసింది. సర్కారి వారి పాట అనే డిఫరెంట్ టైటిల్ ఫిలిమ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ టైటిల్ ని చూస్తుంటే, పరశురామ్ ఏదో కొత్తగా ప్లాన్ చేస్తున్నాడని అర్థం అవుతుంది. గతంలో ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడిన పరశురామ్ మహేష్ బాబు అభిమానులకి కావాల్సిన అన్ని మాస్ అంశాలు తన సినిమాలో ఉండనున్నాయని చెప్పాడు.

ఇపుడు బయటకి వచ్చిన ఈ టైటిల్ ని చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. మాస్ ప్రేక్షకులని బాగా కనెక్ట్ చేసే టైటిల్ నే పెట్టారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ నుండి హీరోయిన్ ని తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే వరకు మహేష్ అభిమానులకి ఒకరకమైన టెన్షన్ తప్పదు.

Differenrt title for Maheshs Next..?:

Sarkari vaari Paata Title for  Mahesh Next
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs