Advertisement
Google Ads BL

లాక్‌డౌన్ పూరీ రాసిన కథలో హీరో అతనా?


పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ ముందు వరకు అట్టర్ ప్లాప్స్‌తో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఇస్మార్ట్ హిట్ తో స్టార్ హీరో విజయ్ దేవరకొండ తగిలాడు. విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా మూవీ కి వెళ్ళిపోయాడు. దానితో పూరి కి కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. కరోనా లాక్ డౌన్ తో విజయ్ దేవరకొండ సినిమాకి బ్రేకిచ్చిన పూరి జగన్నాధ్ ఓ స్టార్ హీరో కోసం ఓ బడా బడ్జెట్ మూవీ కి ప్రిపేర్ అవుతున్నాడని, ఓ కథ కూడా రాసుకున్నాడని పూరీనే స్వయంగా చెప్పాడు. అయితే పూరి కి విజయ్ తర్వాత నెక్స్ట్ హీరో ఎవరంటూ అందరిలో సస్పెన్స్. మధ్యలో ఛార్మి బాలయ్య కోసం స్క్రిప్ట్ రెడీ అని చెప్పినప్పటికీ..  పూరి మైండ్‌లో వేరే హీరో ఉన్నాడంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా పూరి కొత్త కథ రాసుకున్నది బాలీవుడ్ బడా హీరో కోసమని అది కూడా సల్మాన్ ఖాన్ కోసమనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో పూరి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ పోకిరి సినిమాని బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టినప్పటినుండి.. సల్మాన్ - పూరి టచ్ లో ఉన్నారట. అప్పటినుండి పూరి - సల్మాన్ ఇద్దరు కలిసి సినిమా చెయ్యాలని అనుకుంటున్నారట. కానీ ఇప్పటివరకు అది సాధ్యం కాలేదు. అయితే పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ తో తీసే సినిమా కోసం ముంబై కి మకాం మార్చాక మళ్లీ పూరి సల్మాన్ కోసం కథ రెడీ చెయ్యాలని అనుకున్నాడట. అయితే విజయ్ సినిమా పూర్తయ్యాకే ఆ సినిమా కథ రాద్దామనుకుంటే.. కరోనాతో కాలం కలిసొచ్చి పూరి సల్మాన్ కోసం కథ రెడీ చేసాడట. ఇక అది సల్మాన్ కి వినిపించడమే తరువాయి.. వారి కాంబోలో మూవీ ప్రకటన రావడం తథ్యం అంటున్నారు. 

Puri and Salman Khan Combo Soon.. :

Puri penned story in lock down for Salman khan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs