Advertisement
Google Ads BL

సక్సెస్ ఫుల్ రచయిత దర్శకుడిగా మరో ప్రయత్నం..?


సినిమా ఇండస్ట్రీలో రచయితలు దర్శకులుగా మారడం సహజమే. ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ లో ఉన్న దర్శకులందరూ ఒకప్పుడు పేరుమోసిన రచయితలే. అయితే ప్రతీ రచయితా దర్శకుడిగా సక్సెస్ కావాలన్న రూల్ లేదు. చాలా మంది సక్సెస్ ఫుల్ రచయితలు దర్శకులుగా ఫెయిల్ అయినవాళ్ళు ఉన్నారు. అలా ఫెయిల్ అయిన వారిలో బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కూడా ఒకరు.

Advertisement
CJ Advs

రచయితగా ఎంతో పాపులర్ అయిన విజయేంద్రప్రసాద్ గారు దర్శకుడిగా అంతగా పేరు తెచ్చుకోలేకపోయారు. ఇప్పటి వరకూ ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అర్థాంగి, శ్రీ క్రిష్ణ 2006, రాజన్న శ్రీవల్లి మొదలగు చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద తేలిపోయాయి. అయితే ప్రస్తుతం మరో మారు దర్శకుడిగా మారాలని అనుకుంటున్నాడట. తాజాగా ఆయన ఒక స్క్రిప్టు రెడీ చేసుకున్నాడట.

ఈ కథకి ఓ యంగ్ హీరోని తీసుకోవాలని భావిస్తున్నాడట. అలాగే దర్శకుడిగా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నాడట. రచయితగా  బాహుబలి, భజరంగీ భాయ్ జాన్, మెర్సల్ వంటి బ్లాక్ బస్టర్లు అందించిన విజయేంద్రప్రసాద్, ఈ సారైనా దర్శకుడిగా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.

Successful writer turning as director..?:

Vijayendra Prasad wants to direct a Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs