Advertisement
Google Ads BL

త్రివిక్రమ్ మల్టీస్టారర్ న్యూస్.. ఫేక్..!


గత రెండు రోజులుగా ఓ బడా మల్టీస్టారర్ తెరకెక్కించే ప్లాన్ టాలీవుడ్ లో సిద్దమవుతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కూడా ఎన్టీఆర్ RRR సినిమాకి లాకవడంతో.. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా లేటవుతుంది గనక త్రివిక్రమ్ ఈలోపు గా మరొక సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నారు అనే న్యూస్ ఎప్పటినుండో వినబడుతుంది. ఆ సినిమా ఇప్పుడు మల్టీస్టారర్ గా రూపుదిద్దుకోబోతుంది అని అది కూడా.. వెంకటేష్ - నాని ల కలయికలో మల్టీస్టారర్ అంటూ ప్రచారం మొదలయ్యింది. RRR లాక్ డౌన్ కారణముగా లేటవడంతో.. త్రివిక్రమ్ చాలా రోజులు ఎన్టీఆర్ కోసం ఎదురు చూడాలి కనక.. త్రివిక్రమ్ మరో సినిమా ప్లాన్‌లో ఉన్నాడట.

Advertisement
CJ Advs

మరి గతంలో హారిక హాసిని‌కి వెంకటేష్ సినిమా ఒకటి చెయ్యాలి. ఆ సినిమా త్రివిక్రమ్ కాంబోలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు వెంకీ తో కలిసి నాని కూడా కలిపి త్రివిక్రమ్ సినిమా ఉండబోతుంది అని అంటున్నారు. కానీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప షూటింగ్ లో ఉన్నాడు. అలాగే తర్వాత ఎఫ్ 3 చెయ్యాలి. మరో పక్క నాని కూడా శ్యాం సింగరాయ్, టక్ జగదీశ్ సినిమాలు చెయ్యాలి. మరి ఇప్పడు త్రివికమ్ కోసం వెంకీ - నాని లు తమ కమిట్మెంట్స్ పక్కనబెట్టలేరు. అయినా వెంకీ - నాని మల్టీస్టారర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో అంటూ ఓ న్యూస్. అది కనీసం నమ్మేలా లేదు కూడా. అంటే వెంకీ - నాని - త్రివిక్రమ్ మూవీ అనేది ఫేక్ న్యూస్ అని క్లియర్ గా అర్ధమవుతుంది.  

No Multi starrer in Trivikram Srinivas Direction:

Trivikram Srinivas Multi starrer is Fake News 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs