Advertisement
Google Ads BL

‘భానుమ‌తి రామ‌కృష్ణ’ ట్రైల‌ర్‌కు సూపర్బ్ రెస్పాన్స్


న‌వీన్ చంద్ర హీరోగా న‌టించిన భానుమ‌తి రామ‌కృష్ణ ట్రైల‌ర్ కు విశేషాద‌ర‌ణ

Advertisement
CJ Advs

విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఈమేజ్ తెచ్చుకున్న న‌వీన్ చంద్ర హీరోగా తెర‌కెక్కిన సినిమా భానుమ‌తి రామ‌కృష్ణ‌. ఈ సినిమాలో న‌వీన్ స‌ర‌స‌న స‌లోని లూత్రా హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాను య‌శ్వంత్ ములుకుట్ల నిర్మించారు. ఓ ఇండిపెండిట్ వెబ్ ఫిల్మ్ గా భానుమ‌తి రామ‌కృష్ఱ రూపొందించ‌డం జ‌రిగింది. ఈ సినిమాకు శ్రీకాంత్ నాగోతి ద‌ర్శ‌కుడు. న్యాచురాలిటీ కోసం ఈ సినిమాలో కీల‌క స‌న్నివేశాల్ని గొరిల్లా ప‌ద్ధ‌తిలో షూట్ చేశారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకి రాబోతుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్, ట్రైల‌ర్ కు ఆన్ లైన్ లో ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ముప్పై ఏళ్లు దాటిన ఓ యువ‌తి యువ‌కుడు మ‌ధ్య జ‌రిగే ప్రేమ వ్య‌వ‌హార‌మే ఈ సినిమాకు ముఖ్య క‌థాంశ‌మ‌ని ద‌ర్శ‌కుడ శ్రీకాంత్ నాగోతి తెలిపారు. ఫుల్ ఎంట‌ర్ టైనింగ్ గా డిజిటిల్ ఆడియెన్స్ కి న‌చ్చే రీతిన ఈ సినిమా సాగిపోతుంద‌ని నిర్మాత య‌శ్వంత్ ముల‌కుట్ల అన్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని విష‌యాలు అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని య‌శ్వంత్ తెలిపారు.

న‌టీన‌టులు: 

న‌వీన్ చంద్ర‌, స‌లోని లూత్రా, హార్ష త‌దిత‌రులు

 

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌కత్వం - శ్రీకాంత్ నాగోతి

ప్రొడ్యూసర్ - య‌శ్వంత్ ములుకుట్ల‌

మ్యూజిక్ - శ్ర‌వ‌న్ భ‌ర‌ద్వ‌జ్

సినిమాటోగ్రాఫ‌ర్ - సాయిప్ర‌కాశ్

ఎడిట‌ర్ - ర‌వికాంత్ పేరేపు

Click Here for Trailer

Superb Response to Bhanumathi Ramakrishna Trailer:

Bhanumathi Ramakrishna Trailer released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs