Advertisement
Google Ads BL

అదే నిజమైతే లూసిఫర్ రీమేక్‌కు తిరుగుండదంట!


చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత కుర్ర దర్శకుడు సుజిత్ తో లూసిఫర్ రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే మలయాళ లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ మీద కూర్చున్న సాహో దర్శకుడు సుజిత్ తెలుగు ప్రేక్షకులు, మెగా ఫ్యాన్స్ మెచ్చేలా ఈ స్క్రిప్ట్‌ని మారుస్తున్నాడని.. చిరు సలహాలు సూచనలతో లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ అద్భుతంగా వస్తుందని ఫిలిం నగర్ టాక్. అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. అదేమంటే ఈ సినిమాలో చిరుతో కలిసి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించబోతుంది అనే న్యూస్ ఉంది చూశారూ.. అది మాత్రం క్రేజీ క్రేజీ గా మెగా ఫ్యాన్స్ ని షేక్ చేస్తుంది.

Advertisement
CJ Advs

13 ఏళ్ళ తరవాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ సరిలేరు నీకెవ్వరు తర్వాత సైలెంట్ గా ఉన్న విజయశాంతి లూసిఫర్ రీమేక్‌లో నటిస్తుందా? అందులో చిరు సోదరి పాత్రలో? అనేది కాస్త డౌట్. గతంలో హీరో హీరోయిన్ గా బాక్సాఫీసుని షేక్ చేసిన విజయశాంతి - చిరు జంట ఇప్పుడు అక్కా తమ్ముళ్ల పాత్రల్లో అంటే చూడడానికి కష్టమే  అయినా.. ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అయితే సరిలేరు ఈవెంట్ లో చిరు - విజయశాంతి ఆత్మీయంగా మాట్లాడుకోవడం చూసి విజయశాంతి లూసిఫర్ రీమేక్ లో నటించే ఛాన్స్ వుందేమో అంటున్నారు.

అయితే మలయాళ లూసిఫర్ లో మంజు వారియర్ కనిపించిన పాత్రలోనే విజయశాంతి కనిపించబోతుందని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే లూసిఫర్ లో మంజు వారియర్... హీరో మోహన్ లాల్‌కి సోదరి పాత్రలో నటించింది. మరి తెలుగులో చిరుకి సోదరిగా విజయశాంతి పేరు బాగా వినబడుతుంది. మరి అదే గనక నిజమైతే బాక్సులు బద్దలే అంటున్నారు మెగా ఫ్యాన్స్.

Lady Super Star in Chiranjeevi Lucifer Remake:

Vijaya Shanthi name for Chiranjeevi lucifer Remake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs