అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా నుండి రోజుకో వార్త వస్తూనే ఉంది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో సినిమా గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాగా సమాచారం ప్రకారం ప్రముఖ యాంకర్ సుమ ఈ సినిమాలో నటిస్తుందని వార్తలు వచ్చాయి.
అయితే ఇవేమీ నిజం కావట. చిత్తూరు జిల్లా నేపథ్యంగా సాగుతున్న ఈ కథలో అల్లు అర్జున్ కి అక్కగా సుమ నటించనుందని పుకార్లు పుట్టించేశారు. యాంకర్ సుమ టెలివిజన్ లో చాలా బిజీ యాంకర్. అలాంటి యాంకర్ సినిమాల్లో కనిపించడం చాలా తక్కువ. గత కొన్నేళ్లలో ఆమె సినిమాల్లో కనిపించినట్లు దాఖలాలు కూడా లేవు. అందువల్ల సుమ అల్లు అర్జున్ అక్కగా నటిస్తుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అంటున్నారు.
రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయని తీసుకున్న సుకుమార్, ఈ సారి కూడా మరో యాంకర్ ని తీసుకుంటాడన్న ఉద్దేశ్యంతోనే ఇలాంటి పుకారు పుట్టించారని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకిక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.