Advertisement
Google Ads BL

ఆ విషయంలో మళ్ళీ సాహో తరహా కన్ఫ్యూజన్ మొదలైందా..?


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా నుండి వచ్చే అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా నిర్మాతలు ఇప్పుడప్పుడే అప్డేట్స్ బయటపెట్టేలా కనిపించట్లేదు. అయితే ఈ సినిమాలో ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ నటిస్తుందన్న వార్త బయటకి వచ్చింది.

Advertisement
CJ Advs

దాంతో ప్రభాస్ అభిమానుల్లో కొంత ఆనందం కలిగిన మాట నిజమే. అయితే తాజాగా మరో అప్డేట్ కోసం అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ అందించేది ఎవరా అనేది ఇప్పటి వరకూ తెలియకపోవడమే అభిమానులకి నచ్చడం లేదు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడని వార్తలు వచ్చినా, వాటిల్లో నిజం లేదని తేలిపోయింది. దాంతో ప్రభాస్ సినిమాకి మ్యూజిక్ అందించేది ఎవరనే ప్రశ్న మొదలైంది.

ఈ విషయంలో సాహో తరహా కన్ఫ్యూజనే మొదలైందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సాహో సినిమా కోసం మొదట ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని అనుకుని, ఆ తర్వాత ఆ డైరెక్టర్ ని క్యాన్సిల్ చేసి, మళ్ళీ ఒక్కో పాటని ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించుకుని.. మొత్తానికి ఏదో చేసేశారు. చివరికి పాటలకి ఎలాంటి స్పందన వచ్చిందో అందరికీ తెలిసిందే. అందువల్లే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో క్లారిటీగా ఉండమని ప్రభాస్ అభిమానులు కోరుతున్నారు. మరి యూవీ క్రియేషన్స్ ఈ విషయంలోనైనా తొందరగా సమాచారం ఇస్తుందేమో చూడాలి.

Again Same confusion about Prabhas movie..?:

Prabhas 20 Movie music director 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs