కరోనా లాక్‌డౌన్‌లో స్టార్ హీరోయిన్స్ అంతా ఇంటికే పరిమితయ్యారు. ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే వారంతా ఇలా ఇంటికే రెండు నెలలు పరిమితమవడంతో.. హీరోయిన్స్ అయితే బాగా బోర్ ఫీలవుతున్నారు. కరోనా లాక్‌డౌన్ లో చాలామంది అభద్రతకు లోనవుతున్నారని.. అభద్రతా అని గూగుల్ లో కొడితే నమ్మకం కోల్పోవడం అని వచ్చింది అని చెబుతుంది రష్మిక. దానితో ఆమె అభిమానులకు సందేశం ఇచ్చింది. చిన్న చిన్న విషయాలను పట్టించుకుంటూ భయపడుతుంటామని, నేను బరువు పెరిగానా? నా చర్మం ఎలా ఉంది? సన్నగా ఉన్నానా? జిడ్డుగా ఉన్నానా? అని అడుగుతుంటామని, నీ ముఖానికి ఏమైంది అనగానే మనం ఇక అయిపోతామని, చాలా రోజుల వరకు బయటికి రావడానికి భయపడతామని చెబుతుంది.
కానీ ఈ కష్టాన్ని అభద్రతని అధిగమించాలని చెబుతుంది. అసలు తానే ఈ కరోనా లాక్‌డౌన్‌లో చాలా అభద్రతకు లోనయ్యానని చెబుతుంది. నా మనసు, నా ఫిజిక్, నా పని, నా మానసిక ఆరోగ్యం ఇలా ప్రతి విషయంలోనూ భయపడ్డాను. కానీ ప్రతి విషయాన్నీ మనం అదుపు చేయలేమని తెలుసుకున్నాను. అందుకే సాధ్యమైనంతగా కంట్రోల్‌లో ఉంచడానికి ట్రై చేద్దాం.... మనలోని బెస్ట్‌ని బయటికి తీద్దాం. అసలు మీకు నేను చెప్పే పాయింట్ ఏమిటంటే.. అభద్రతా భావాన్ని, భయాన్ని మీ బలంగా మార్చుకోండి. నీవు నల్లగా ఉన్నావు, నీవు సన్నగా ఉన్నావు, నీ బరువేమిటి అంటే మీరస్సలు ఫీలవ్వొద్దు. మిమ్మల్ని మీరు నమ్మండి. ఇవన్నీ కేవలం తాత్కాలికమే అంటూ కరోనా లాక్ డౌన్ లో ఎలా ఉండాలో చెబుతుంది పాప రష్మిక.