Advertisement
Google Ads BL

ఈ మెగాహీరోలను రానా మోసం చేశాడంట!


దగ్గుబాటి రానా పెళ్లి వయసు దాటిపోయినా చాలా రోజులకి పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతున్నాడు. తన బాబాయ్ కూతురు ఆశ్రీత ఫ్రెండ్ మిహీకాని పెళ్ళాడుతున్న రానా ప్రేమ ముచ్చట్లు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. రానా ప్రేమకి పెళ్లికి అందరూ విషెస్ చెబుతుంటే.. మెగా హీరోలు మాత్రం సోషల్ మీడియాలో పెళ్లిపై జోక్స్ పేలుస్తున్నారు. రానాకి విషెస్ చెప్పిన మెగా హీరో సాయి ధరమ్ తేజ తన బావ మరో మెగా హీరో వరుణ్ తేజ్‌ని ఉద్దేశించి..  ఏం బావా నీకు పెళ్ళంటా అని ఆటపట్టించాడు. మొన్నీమధ్యనే నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లి వచ్చే ఏడాది ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు సాయి తేజ్ కూడా పెళ్ళంటగా బావ అని అడగడంతో వరుణ్ తేజ్ కూడా ఫన్నీ రిప్లై ఇచ్చాడు.

Advertisement
CJ Advs

సాయి తేజ్‌ని ఉద్దేశించి.. నా పెళ్ళికి చాలా టైం ఉందిలే... కానీ మన రానా, నితిన్ లు మాత్రం ఎప్పటికి నీకు తోడుగా ఉంటామని చెప్పి.. హ్యాండ్ ఇచ్చేసి..సింపుల్ గా సింగల్ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయ్యిపోయారు.. అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక వరుణ్ తేజ్ ట్వీట్ కి రిప్లై గా మంచు లక్ష్మి అవును నిజమే అంటూ ట్వీట్ చేసింది. మరి ఈ ఏడాది నితిన్ కూడా ప్రేమించిన అమ్మాయితో పెళ్లి పీటలెక్కడానికి సిద్దమవడం నితిన్ పెళ్ళికి కరోనా అడ్డం పడడం జరిగింది. ఇక రానా తాజాగా ప్రేమ విషయం చెప్పి పెళ్ళికి రెడీ అవడంతో ఈ మెగా హీరోల సోషల్ మీడియా ముచ్చట ఇలా సాగింది.

Varun Tej and Sai Dharam Tej Conversation about Rana Cheating:

Rana and Nithiin Cheating revealed by mega Heroes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs