Advertisement
Google Ads BL

‘బ్లాక్’గా రాబోతున్న ఆది సాయికుమార్


మ‌హంకాళి మూవీస్, డైనమిక్ హీరో ఆది సాయికుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న‌ చిత్రం ‘బ్లాక్’

Advertisement
CJ Advs

మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే మాస్‌ క‌మ‌ర్షియ‌ల్ హీరో ఆది సాయికుమార్ హీరోగా, ఆట‌గాడు చిత్రంతో ప‌రిచ‌యమైన ద‌‌ర్శ‌నాబానిక్ ని హీరోయిన్ గా, జి.బి.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం లో మ‌హంకాళి దివాక‌ర్ నిర్మాత‌గా మ‌హంకాళి మూవీస్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రానికి బ్లాక్ అనే టైటిల్ ని యూనిట్ క‌న‌ఫ‌ర్మ్ చేసారు. లాక్‌డౌన్ కి ముందు షూటింగ్ ఆగిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్ర షూటింగ్ 70 శాతం పూర్తిచేసుకుంది. మిగ‌తా బ్యాల‌న్స్ షూటింగ్ ని లాక్‌డౌన్ త‌రువాత పూర్తిచేసి విడుద‌ల‌ చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు. శనివారం ఈ చిత్రం యొక్క టైటిల్ ని కొన్ని వ‌ర్కింగ్ స్టిల్స్ మ‌రియు మేకింగ్ వీడియోని విడుద‌ల చేయ‌టం జ‌రిగింది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత మ‌హంకాళి దివాక‌ర్ మాట్లాడుతూ.. మహంకాళి మూవీస్ పతాకంపై ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రానికి బ్లాక్ అనే టైటిల్ని ఖరారు చేసాము. టైటిల్ తో పాటు ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోని మరియు వర్కింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేశాము. ఈ చిత్రానికి ఇప్ప‌టికే భారి అంచ‌నాలు వుండ‌టంతో ఈ మేకింగ్ మ‌రింత క్రేజ్ ని తీసుకువ‌చ్చింది. ఎంతో కసిగా సక్సెస్ కోసం చూస్తున్న హీరో ఆదికి గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ డిఫరెంట్ కోణంలో కొత్తగా ఉంటుంది, ఈ చిత్రం ఆది కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలుస్తుంది. భారీ సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రం లాక్ డౌన్ తర్వాత బ్యాలెన్స్ వర్క్ శరవేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాము. ఆది సాయికుమార్ అభిమానుల‌, సినీ ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకుంటుందీ చిత్రం.. అని అన్నారు.

 

న‌టీన‌టులు..

 

హీరోయిన్ - దర్శనా బానిక్,

బిగ్ బాస్ కౌశల్

ఆమని

వెన్నెల కిషోర్

శ్యామ్ కృష్ణ

సూర్య

చక్రపాణి

విశ్వేశ్వరరావు

ప్రియదర్శన్

తాగుబోతు రమేష్

శ్రీనివాస్ చక్రవర్తి

చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి

 

టెక్నిషియ‌న్స్‌...

 

 

రచన దర్శకత్వం - జీ.బి కృష్ణ

నిర్మాత - మహంకాళి దివాకర్

కెమెరామెన్ - సతీష్ ముత్యాల

మ్యూజిక్ డైరెక్టర్ - సురేష్ బొబ్బిల

ఎడిటర్ - అమర్ రెడ్డి

ఆర్ట్ డైరెక్టర్ - కె.వి.రమణ

స్టంట్స్ - రామకృష్ణ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శంకర్

పి.ఆర్.ఓ  -ఏలూరు శీను

Hero Aadi Saikumar next Film Title Announced:

Dynamic hero Aadi Saikumar’s next, under Mahankali Movies production, titled ‘Black’
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs