మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అల్లు అర్జున్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచి నాన్ బాహుబలి రికార్డుని నెలకొల్పింది. అయితే ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్, షూటింగ్ పూర్తవగానే త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేస్తాడని అనుకున్నారు.
అంతా సవ్యంగా జరిగితే ఈ ఏడాది సెప్టెంబరు సరికల్లా ఎన్టీఆర్- త్రివిక్రమ్ ల కాంబినేషన్లో సినిమా స్టార్ట్ అయ్యేలా ప్లాన్ వేసుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆ ప్లానింగ్ మొత్తం చెడిపోయింది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ విడుదల జనవరిలో ఉండదని నిర్మాతలు తేల్చేశారు. అదీగాక ప్రస్తుత పరిస్థితులని చూస్తుంటే షూటింగ్ కి అనుమతులు వచ్చేలా కనిపించట్లేదు.
తెలంగాణ ప్రభుత్వం షూటింగులకి అనుమతులు ఇస్తుందని వస్తున్న వార్తలు నిజమే అయినప్పటికీ, ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ బడ్జెట్ సినిమాకి తక్కువ మంది పనివారితో షూటింగ్ చేయడం కుదరని పని. అందువల్ల ప్రస్తుతం ఈజీగా చిత్రీకరించే సన్నివేశాలని తెరకెక్కీచేసుకుని, ఎక్కువ మంది అవసరమయ్యే సీన్లని డిసెంబరులో చిత్రీకరించాలని ప్లాన్ వేస్తున్నారు.
ఇదే జరిగితే జనవరిలోనూ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కి దొరకడు. కాబట్టి త్రివిక్రమ్ కి ఈ సంవత్సరం మొత్తం పోయినట్టే.. మరి ఈ గ్యాప్ లో ఏదైనా చిన్న సినిమా తీస్తే బాగుంటుందేమో అని సలహా ఇస్తున్నారు. చూడాలి మరి త్రివిక్రమ్ ఏం చేస్తాడో..!