నేచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ మంచి జోష్ మీదున్నాడు. నానితో సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అన్న నమ్మకం నిర్మాతల్లొ ఎప్పుడో వచ్చేసింది. అందుకే ఆఫర్లు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. కథల విషయంలో చాలా పర్ ఫెక్ట్ గా ఉండే నాని, కొత్త కొత్త కథలు వింటూ కొత్త దర్శకులకి అవకాశాలు ఇస్తున్నాడు. దాంతో ఇండస్ట్రీలోకి ఏ కొత్త పాయింట్ తో కథ వచ్చిన అది నాని దగ్గరకి వస్తుందని చెప్పుకుంటారు.
తాజాగా నాని, సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీకాంత్ ఓదెల నానికి సరికొత్త కథని వినిపించాడు. ఓదెల చెప్పిన కథకి ఇంప్రెస్ అయిన నాని వెంటనే ఓకే అనేశాడని టాక్. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తవగానే శ్రీకాంత్ తో సినిమా మొదలుపెడతాడట. అయితే ఈ సినిమాలో నాని తెలంగాణ మాండలికంలో మాట్లాడనున్నాడట.
ఇప్పటివరకు నాని చేసిన అన్ని సినిమాలని పరిశీలిస్తే, కృష్నార్జున యుద్ధం సినిమాలో రాయలసీమ యాసలో మాట్లాడి అదరగొట్టాడు. ఓదెల చెప్పిమ కథ తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగనుందట. దాంతో నాని ఆ యాసని నేర్చుకునేందుకు సిద్ధం అవుతాడట. గ్రామీణ తెలంగాణ యాస అంటే కొంచెం సవాలే అని చెప్పాలి. మరి ఆ సవాలుని స్వీకరించి తన యాసతో మనల్ని మరిపిస్తాడా లేదా చూడాలి.