Advertisement
Google Ads BL

పూరి జగన్నాథ్ నెక్స్ట్ హీరో సల్మాన్ ఖాన్..?


వరుస ఫ్లాపులు వెంటాడుతున్న టైమ్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్టు కొట్టి తనని విమర్శించిన వారి నోళ్ళు మూయించిన పూరి జగన్నాథ్, ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే చిత్రం చేస్తున్నాడు. కరణ్ జోహార్ తో కలిసి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో తీర్చిదిద్దుతున్నాడు. విజయ్ కి బాలీవుడ్ లో ఈ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఉండనుంది.

Advertisement
CJ Advs

అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. ఎక్కువ భాగం ముంబయిలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం  ప్రస్తుత పరిస్థితుల్లో ముంబయి వెళ్లే అవకాశమే లేదు. దాంతో హైదరాబాద్ లోనే చిత్రీకరణ పూర్తి చేయాలని చూస్తున్నారు. అదలా ఉంటే పూరి తన తర్వాతి చిత్రం సల్మాన్ ఖాన్ తో తీస్తాడని వార్తలు వస్తున్నాయి. పూరి రాసుకున్న లైన్ విన్న సల్మాన్ ఖాన్ ఇంప్రెస్ అయ్యాడట.

దాంతో పూరి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడని టాక్. ఈ లాక్డౌన్ టైమ్ లో పూర్తి స్క్రిప్టుని రెడీ చేయమని చెప్పాడట. పూర్తి స్క్రిప్టు విన్నాక పూరి దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడట. ప్రస్తుతానికి ప్రభుదేవా దర్శకత్వంలో రాధే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బుడ్డా హోగా తేరా బాప్ తర్వాత బాలీవుడ్ వైపు చూడని పూరి జగన్నాథ్ కి సల్మాన్ ఖాన్ అవకాశం ఇస్తాడేమో చూడాలి.

Puri Next hero would be Salman khan..?:

puri Next hero would be Salman khan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs