Advertisement
Google Ads BL

బిగ్‌బాస్-04 హోస్ట్, కంటెస్టెంట్స్ వీళ్లేనా!?


తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకూ 1,2,3 షోలను విజయవంతంగా నడిపించేసింది. కరోనా కష్టకాలం తర్వాత బిగ్ బాస్-04కు ‘మా’ టీవీ యాజమాన్యం ప్లాన్ చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఇందులో భాగంగా షోకు హోస్ట్‌గా ఎవర్ని తీసుకోవాలి..? కంటెస్టెంట్స్‌గా ఎవరెవర్ని తీసుకోవాలి..? అనే విషయాలపై సమాలోచనలు చేస్తోందట. ఈ సారి బుల్లి తెర నుంచి ఎంత మందిని తీసుకోవాలి..? వెండితెర నుంచి ఎంతమందిని తీసుకోవాలి..? సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారెవరు..? అని నిశితంగా పరిశీలిస్తోందట సెలక్షన్ టీమ్.

Advertisement
CJ Advs

నో చెప్పేసిన అనసూయ..!

అయితే ఇటీవలే.. అటు బుల్లితెర.. ఇటు వెండితెరను ఏలుతున్న యాంకర్ కమ్ నటి అనసూయను సంప్రదించారని.. ఆ భామ మాత్రం అబ్బే.. ‘నేను బిగ్ బాస్‌ షోకా’ నో వే అని తేల్చిచెప్పేసిందని టాక్ నడిచింది. భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్నప్పటికీ నో చెప్పేసిందట. అసలు తానెందుకు ఇలా చెప్పింది అనే దానికి సుధీర్ఘంగా వివరణ కూడా ఇచ్చుకుందట. ఆఖరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అయినా మీరు వస్తారా..? అని అనసూయను అడగ్గా అప్పుడు చూద్దాం లే అని మిన్నకుండిపోయిందట. అదలా ఉంటే.. తాజాగా ఇదిగో వీరిని కంటెస్టెంట్లుగా రావాలని నిర్వాహకులు సంప్రదించారని టాక్ నడుస్తోంది.

హోస్ట్, కంటెస్ట్ంట్స్ వీరేనా..

లవర్ బాయ్ హీరో త‌రుణ్‌, జాహ్నవి, మంగ్లీ, యాంకర్ వ‌ర్షిణి, అఖిల్ శ్రత‌క్‌, యాంక‌ర్ శివతో పాటు ఓ ప్రముఖ చానెల్‌కు చెందిన లేడీ యాంకర్‌ను, ఓ కమెడియన్‌ను కూడా సంప్రదించారని టాక్ నడుస్తోంది. వీరందర్నీ ఇటీవలే నిర్వాహకులు సంప్రదించి పలు విషయాలపై చర్చించారట. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ పర్సన్ ఎవరు..? తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య బాగా పాపులర్ అయిన సామాన్యుడు ఎవరైనా ఉన్నారా..? సీరియల్స్ నుంచి ఇంకా ఎవర్నయినా తీసుకోవాలా..? అని నిర్వాహకులు ఆరా తీస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్-03ని విజయంతంగా ఇదివరకెన్నడూ లేని విధంగా టీఆర్పీ రాబట్టిన అక్కినేని నాగార్జననే మళ్లీ హోస్ట్‌గా తీసుకోవాలని ‘మా’ యాజమాన్యం భావిస్తోందట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

Telugu Bigg Boss 4 : Host, Rumoured List of Contestants:

Telugu Bigg Boss 4 : Host, Rumoured List of Contestants  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs