Advertisement
Google Ads BL

అనుపమ నిత్య సంతోషానికి కారణం ఇదే!


ప్రస్తుతం లాక్ డౌన్‌తో షూటింగ్స్‌కి వెళ్లలేకపోతున్నామని చాలామంది హీరోయిన్స్ తెగ బాధపడిపోతున్నారు. లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో... ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళతామో అంటూ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేని అనుపమ పరమేశ్వరన్ కూడా లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తోందా? ఎప్పుడు సెట్స్ మీదకెళ్తామా అని ఎదురు చూస్తుందట. తాజాగా అనుపమ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. మీరెప్పుడూ సంతోషంగా కనబడతారు అదెలా సాధ్యం అని అడగగా..

Advertisement
CJ Advs

దానికి అనుపమ నవ్వుతూ.. నేను నా పనిని ప్రేమిస్తాను.... అందుకే ఎల్లప్పుడూ సంతోషంగా కనబడతాను అంటుంది. చిన్నప్పటినుండి నటిగా మారాలని అనుకున్నాను.. ఇప్పుడు హీరోయిన్ అయ్యాను. అందుకే చాలా సంతోషంగా ఉన్నాను. ఇక సెట్స్ లో ఉన్నప్పుడు ఓ సీన్ షూట్ పూర్తవ్వగానే అది మనమనుకున్న దానికన్నా బాగా వస్తే ఆ సంతోషం మన మొహంలోనే కనబడుతుంది. అసలు మీరు నమ్ముతారో లేదో... నేను నా పనితో సంతృప్తిగా ఉన్న రోజు నాకు రాత్రి పూట నిద్ర కూడా పట్టదు అని చెబుతుంది ఈ అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.

Anupama Parameswaran Talks about her Happiness :

Anupama Parameswaran answer to Netizen question
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs