‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్ జనాలకు దగ్గరైన బ్యూటీ ఆదా శర్మ. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఆ సినిమాతో హార్ట్‌లు దోచుకోకపోయినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం తెగ పాపులర్ అయ్యింది. హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ అందరి హార్ట్‌ను కొల్లగొడుతోంది. ఆమె హాట్ హాట్ అందాలకు పెద్ద ఎత్తున అభిమానులు తయారయ్యారు. అలా సోషల్ మీడియాతో బాగా పాపులర్ అయిపోయింది ఆదా. అందాలను ఆదా చేస్తే ప్రయోజనం ఏముంటుంది.. ఆరబోసేద్దాం అన్నట్లుగా నిత్యం రెండు మూడు హాట్ పిక్‌లతో ఫాలోవర్స్‌ను ఫిదా చేస్తుంటుంది. ఇదిగో తాజాగా రిలీజ్ చేసిన ఓ ఫొటోతో మరోసారి ఈ భామ హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఈ బ్యూటీ పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తోందో లేకుంటే ఇంకేమైనా కావాలా..? అనేది అర్థం కాని పరిస్థితి.
‘ఆదా’ చేయలేకేనా!?
దేనికైనా హద్దులుంటాయ్.. అవి దాటితే పరిస్థితి వేరేలా ఉంటుంది. కానీ.. ఆదా మాత్రం హద్దులు కాదు సరిహద్దులే దాటేసి మరీ ఇలా వింతగా ప్రవర్తిస్తోంది. హాట్ ఫొటోలతోనే సరిపెడుతుందా అంటే అస్సలు కాదు.. హాట్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోందీ భామ. తాజాగా.. బాత్ టవల్‌లో బెడ్‌పై పిక్‌ను షేర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్‌గా నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు, ఫాలోవర్స్, ఫ్యాన్స్ అవాక్కవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇలా హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేయడం ఆదాకు కొత్తేమీ కాదు.
జర జాగ్రత్త మేడమ్..!
మేడమ్ మీకు పబ్లిసిటీ పిచ్చి పీక్ స్టేజ్‌కు వెళ్లినట్లుంది.. కాస్త మీ అందాలు ఆదా చేస్తే మీకే మంచిదని కొందరు కామెంట్స్ చేయగా.. ఇంకొందరేమో అబ్బే అంతేనా ఇంకేం లేదా అని చిత్రంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే జర జాగ్రత్త మేడం.. టవల్ ఊడిపోతే అంతే సంగతులు అంటూ కామెంట్స్ చేయసాగారు. ఏదైతేనేం ఈ మధ్య ఆదా ఆరబోతకు అస్సలు లిమిట్స్ లేకుండా పోతోంది. మరీ ఇలా చేస్తే ఎవరైనా అవకాశాలు ఇస్తారని చేస్తోందో.. లేకుంటే అందాలు ఆదా చేయడం అస్సలు ఇష్టం లేక చూపించేస్తోందో ఆ భామకే ఎరుక.