అభినయనంలో, డైలాగ్ పలకడంలో తాతకు తగ్గ మనవడిగా సత్తా చాటుతూ టాలీవుడ్‌లో రాణిస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నందమూరి వారసుడిగా సినీ అరంగేట్రం చేసిన ఆయన అతి తక్కువ కాలంలోనే తనకంటూ గుర్తింపును సంపాదించుకున్నాడు. తెలుగు సినీ ప్రపంచంలో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్ పుట్టినరోజు మే-20. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా పలువురు దర్శకనిర్మాతలు, నటీనటులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. అందరి విషెస్ నార్మలే.. నటి పూనం కౌర్ చేసిన ట్వీట్ మాత్రం నెట్టింట చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ అనే పేరు పెట్టకుండా.. ఎక్కడా అసలు ఆయన్ను ఇన్వాల్వ్ చేయకుండానే ఆమె ట్వీట్ చేసినప్పటికీ జూనియర్ ఫ్యాన్స్ మాత్రం పసిగట్టేశారు. ఇంతకీ ఆమె చేసిన ఆ సంచలన ట్వీట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇదీ ఆ ట్వీట్ సారాంశం..
‘ఆయన ప్రమేయం లేకుండానే చిన్ననాటి నుంచి పెద్దయ్యేంత వరకు తిరస్కరణకు గురయ్యాడు. ప్రేమకు కూడా దూరమయ్యాడు. ఆయన ప్రయాణాన్ని నేను ఎంతో గౌరవిస్తున్నాను. స్వర్గంలో ఉన్న అతని తాత ఆశీర్వాదాలు ఎప్పుడూ ఆయనకు ఉంటాయి. బెస్ట్ విషెస్’ అని ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఇండైరెక్టుగా పూనం ట్వీట్ చేసింది. చివరగా మూడు లవ్ సింబల్స్ ఉన్న ఎమోజీలను పూనమ్ ఆ ట్వీట్‌కు జతచేసింది. ఎస్ మేడం మీరు చెప్పింది అక్షరాలా నిజమే.. నిజంగా మా హీరో రీల్ లైఫ్‌లో చాలా కష్టాలు పడ్డారని కొందరు అభిమానులు చెబుతున్నారు. కొందరు మాత్రం అదేంటి పేరు చెప్పకుండా ట్వీట్ చేశారేంటి మేడమ్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం థ్యాంక్యూ పీకే (పూనమ్ కౌర్) అంటూ రిప్లయ్ ఇచ్చారు.