Advertisement
Google Ads BL

పూరి-విజయ్ ‘ఫైటర్‌’పై తాజా అప్డేట్స్ ఇవీ!


డాషింక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్- సంచలన కథానాయకుడు విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ మూవీకి ‘ఫైటర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌తో సినిమా షూటింగ్ ఆగిపోయింది కానీ లేకుంటే ఈ పాటికే షూటింగ్ పూర్తయ్యేది. కరోనాకు ముందు ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువశాతం ముంబయ్‌ ధార్విలో జరిగింది. త్వరలోనే మళ్లీ సినిమా షూటింగ్‌కు పూరీ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ తరుణంలో ఈ సినిమాకు సంబంధించి రెండు లేటెస్ట్ అప్డేట్స్ వెలుగు చూశాయి. అందులో ఒకటి రూమర్ కాగా.. ఇంకొకటి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న చార్మీనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంతకీ ఆ రెండేంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement
CJ Advs

రూమర్ ఇదీ..

ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడట. ఇందులో ఒకటి ‘ఫైటర్’గా ఫిట్ బాడీతో మాస్‌గా కనిపిస్తాడట. ఇక రెండో రోల్ విషయానికొస్తే లవర్ బాయ్‌గా క్యూట్‌గా కనిపిస్తాడట. మరోవైపు ఇది క్లాసీగా సాగే చిత్రమని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముందు క్లాస్‌గా ఉన్న విజయ్.. ఫైటర్‌గా మారుతాడా లేకుంటే రెండూ రెండు పాత్రలేనా..? అనేది తెలియరాలేదు. ఇప్పటికే విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. కాగా.. వరల్డ్ ఫేమస్ లవర్‌లో డ్యూయల్ కంటే ఎక్కువగానే పాత్రల్లో నటించిన విషయం విదితమే.

చార్మీ చెప్పిన తాజా అప్డేట్ ఇదీ..

ఇప్పటి వరకూ సినిమా టైటిల్ ‘ఫైటర్’ అని అందరూ అనుకున్నారు. కానీ టైటిల్ అది కాదట. ఈ సినిమాకు మంచి టైటిల్‌ను పూరీ ఫిక్స్ చేశాడని.. షూటింగ్ మొదలైన తర్వాత మంచి సందర్భం చూసుకుని టైటిల్ చెప్పి అదిరిపోయే అప్డేట్ ఇస్తారని చార్మీ చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఫైటరే బాగుంది కదా..? మళ్లీ ఇది మార్చడమేంటి..? అని సోషల్ మీడియా వేదికగా అభిమానులు పూరీ, విజయ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఒకవేళ ‘ఫైటర్’ కాకుంటే ‘లైగర్’ పక్కా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి మంచి సందర్భం ఎప్పుడు వస్తుందో..? టైటిల్‌ను పూరీ ఎప్పుడు రివీల్ చేస్తాడో వేచి చూడాలి.

Two Updates From Puri-Vijay Devarkonda Movie!:

Two Updates From Puri-Vijay Devarkonda Movie!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs