ఈ ఏడాది రెండు సినిమాల హిట్స్ తో టాప్ లేపి.. అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీ పుష్ప లో నటించబోతున్న లక్కీ హీరోయిన్ రష్మిక మందన్న. కరోనా లాక్ డౌన్ కారణంగా సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటూ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తుంది. తాజాగా రష్మిక అభిమానులనుద్దేశించి ఓ ట్వీట్ చేసింది. అదేమంటే... ఒకవేళ నేను పేరు మార్చుకోవాలంటే.. ఏం పేరు అయితే బాగుంటుందో.. కాస్త మంచిగా అలోచించి చెప్పండి అంటూ ట్వీట్ చేసింది.
అయితే కొంతమంది మీకు లిల్లీ పేరు బావుంటుంది అని.. (లిల్లీ అంటే డియర్ కామ్రేడ్ మూవీలో రష్మిక పేరు) మరికొందరు తలా రష్మిక అని, మరికొందరు మోని అని.. ఇంకొందరు ఏకంగా రష్మిక విజయ్ దేవరకొండ అని మార్చుకుంటే బావుంటుంది అంటూ రష్మిక కి కొత్తకొత్త పేర్లు సూచించారు. ఇక కొంతమంది అయితే.. మేడం మీ పేరు మీకు బావుంటుంది. రష్మిక అనే ఉంచుకోండి.. పేరు మార్చుకోకండి అంటూ రష్మికకి సలహాలిచ్చారు.