Advertisement
Google Ads BL

మే-31న మహేష్-పరశురామ్ మూవీ అప్డేట్!


సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న విషయం విదితమే. ఇప్పటికే సినిమా ఇదిగో ఇలా ఉంటుందని అధికారికంగానే పరశురామ్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ చిన్న హింట్ ఇచ్చాడు. తనకు ‘మహర్షి’ వంటి మంచి హిట్టిచ్చిన వంశీ పైడిపల్లిని పక్కనెట్టి మరీ పరశురామ్‌కు మహి చాన్సిచ్చాడు. వాస్తవానికి ఇప్పటికే షూటింగ్ షురూ కావాల్సినప్పటికీ కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ప్లాన్ మొత్తం ప్లాప్ అయ్యింది. అయితే తాజాగా సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

Advertisement
CJ Advs

మే-31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. అదే రోజున మహేష్ ఫ్యాన్స్‌కు చిన్న పాటి అప్డేట్ అనగా సినిమా లుక్ గానీ లేదా టైటిల్ రివీల్ చేయడం కానీ చేస్తే బాగుంటుందని పరశురామ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇంతవరకూ మహేష్ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అయితే ఆ రోజునే అధికారిక ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది. అదే విధంగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు..? ఇతరత్రా పాత్రధారులు ఎవరనే విషయం కూడా అదే రోజు క్లారిటీ వచ్చే ఉంది. 

ఇప్పటికే బాలీవుడ్ భామ కియారా అద్వానీ లేదా కీర్తి సురేష్‌ను తీసుకోవాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు.. ఇందులో మహేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని ఒకటి మాఫియాగా ఇంకొకటి లవర్ బాయ్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ ఇవ్వనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. సో.. ఫైనల్‌గా సినిమాకు సంబంధించి అసలు విషయాలు తెలియాలంటే మే-31 వరకు వేచి చూడక తప్పదు.

Mahesh-Parsuram Movie Update From May-31st!:

Mahesh-Parsuram Movie Update From May-31st!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs